అంబటి రాంబాబును మెల్లగా ఫిక్స్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సహకారంతో అక్రమ మైనింగ్ జరుగుతోందని హైకోర్టులో దాఖలైన పిటిషన్లో అంబటి రాంబాబు ఊహించని అఫిడవిట్‌ను ప్రభఉత్వం దాఖలు చేసింది. దర్యాప్తు కోసం కమిటీ వేశామని .. అక్రమ మైనింగ్ జరిగిందని గుర్తించామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టు అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. క్రిమినల్ కేసులు నమోదు చేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అయితే పిటిషనర్ల తరపు న్యాయవాదులు మాత్రం.. అక్రమ మైనింగ్‌పై పిటిషన్ వేసిన వారిపై కేసులు పెట్టారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. శాటిలైట్ సర్వే చేయిస్తే నిజాలు తెలుస్తాయని కోర్టుకు విన్నవించారు. దీంతో పూర్తి వివరాలతో రావాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అక్రమ మైనింగ్ జరగలేదని ప్రభుత్వం ఇప్పటి వరకూ వాదిస్తూ వచ్చింది. హఠాత్తుగా దర్యాప్తు కమిటీ వేశామని అక్రమ మైనింగ్ నిజమేనని చెప్పడంతో అంబటి రాంబాబుకు షాక్ తగిలినట్లయింది. ఈ కేసు మెల్లగా అంబటి రాంబాబు వైపు వస్తుందని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే… ప్రధానంగా అక్రమ మైనింగ్ జరుగుతోంది అంబటి రాంబాబు అండతోనేనని.. పిటిషన్లు ఆరోపిస్తున్నారు.
దీనిపై మరింత లోతుగా విచారణ జరిపితే.. అంబటి రాంబాబు ఇరుక్కుపోతారని ఆందోళన చెదుతున్నారు. ప్రభుత్వం హఠాత్తగా అక్కడ అక్రమ మైనింగ్ జరిగిందని ఎందుకు కోర్టుకు చెప్పిందో అర్థం కాక… అంబటి అనుచరులు జుట్టు పీక్కుంటున్నారు. భవిష్యత్‌లో అంబటి రాంబాబు ఎలాంటి తోక జాడించకుండా ఉండేందుకు ఈ కేసును గుప్పిట్లో పెట్టుకునేందుకు వైసీపీ పెద్దలు .. హైకోర్టుకు అక్రమ మైనింగ్ జరిగిందని అఫిడవిట్ ఇచ్చారని అనుమానిస్తున్నారు. మొత్తానికి అంబటి రాంబాబుకు గట్టి షాక్ తగిలినట్లేనని చెబుతున్నారు.