తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమ గెలస్తే.. ఏపీలో చంద్రబాబు బలపడతారని అనుకుంటున్నారో… తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తమకు ఫ్రెండ్లీ కాబట్టి… మళ్లీ ఆ ప్రభుత్వం రావాలనుకుంటున్నారో కానీ… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మీడియా టీఆర్ఎస్ కు.. మాట సాయం చేస్తున్నాయి. కొద్ది రోజుల కిందట.. కూకట్ పల్లిలో .. ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి… తెలంగాణలో ప్రజాకూటమిని ఓడించి తీరాల్సిందేనని …. పంతం పట్టిన వైసీపీ సానుభూతి పరులు.. వినడానికే ఎబ్బెట్టుగా అనిపించే…. జై కేసీఆర్ – జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఈ వివాదాన్ని.. వీడియోలను.. ఏపీలో వైరల్ గా మార్చుకునేందుకు… తెలుగుదేశం పార్టీ చేయాల్సిన పనులు అన్నీ చేస్తూండగానే… జగన్ మీడియా.. మరింత ఉద్ధృతంగా కేసీఆర్ కు సపోర్ట్ చేస్తోంది.
కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత.. టీఆర్ఎస్ గెలుస్తుందా.. ఓడిపోతుందా .. అన్నదానిపై.. ఎవరికీ అనుమానాల్లేవు. అంతగా క్లియర్ కట్ ఎడ్జ్ తెచ్చుకున్న టీఆర్ఎస్ .. గ్రాఫ్ అనూహ్యంగా పతనం అవడం ప్రారంభించింది. మొదట్లో.. ప్రధాన మీడియా.. కాస్త బ్యాలెన్సుడ్ గా వ్యవహరించినా… సోషల్ మీడియా మాత్రం విజృంభించింది. ఆ తర్వాత పబ్లిక్ పల్స్ … తెలిసిపోతూండటంతో.. ప్రధాన మీడియా కూడా.. మెల్లగా.. వాస్తవ ప్రపంచంలోకి రావడం ప్రారంభించింది. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న పబ్లిక్ పల్స్ ను.. ఓ మాదిరిగా అయినా బయటపెట్టడం ప్రారంభించింది. దీంతో తెలంగాణలోని అసలు పరిస్థితి ప్రజలకు అర్థమవడం ప్రారంభించింది. పరిస్థితి వ్యతిరేకంగా మారుతూండటంతో… జగన్ మీడియా ఆందోళన చెందిందేమో కానీ… టీఆర్ఎస్ కు జనాల్లో మంచి ఆదరణ ఉందని.. బెట్టింగుల్లో ఫేవరేట్ గా ఉందని.. ముఖ్యంగా ఏపీలో అందరూ.. టీఆర్ఎస్సే గెలుస్తుందని చెప్పుకుంటున్నారని కథనాలు రాయడం ప్రారంభించారు.
ఏపీ ప్రజలు.. తెలంగాణలో ఉన్న బంధుమిత్రులకు ఫోన్లు చేసి… ఇలా చెబుతున్నరంటూ.. టీఆర్ఎస్ కు పూర్తి సానుకూల వాతావరణం ఉందని చెప్పుకొస్తున్నారు. ఈ కథనాలల్లో కొత్త కోణం ఏమిటంటే… గతంలో టీఆర్ఎస్ ఓటమి అంచుల్లో ఉండేదట. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోగానే.. ఆ గెలుపు అవకాశాలన్నీ దెబ్బతిని పోయాయట. చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు వల్లే… కాంగ్రెస్ ఓడిపోతోందట. మొత్తానికి.. టీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న మౌత్ టాక్ ను.. మార్చడానికి … జగవి మీడియా తన శాయశక్తులా ప్రయత్నిస్తోందన్న విషయంపై క్లారిటీ వస్తోంది.