సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి సారి దావోస్ మీటింగ్‌కు వెళ్లిన సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి రోజు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సలహా పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్, హెల్త్ విభాగాధిపతి డాక్టర్ శ్యాం బిషేన్‌తో భేటీ అయ్యారు. తర్వాత ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించారు. డబ్ల్యూఈఎఫ్ ఫ్లాట్‌ఫాం పార్టనర్‌షిప్‌పై ఒప్పందం కూడా చేసుకున్నారు. డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం వల్ల తయారీ రంగంలో అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. కాలుష్యంలేని ఇంధనాల అంశంపైనా దావోస్ చర్చల్లో సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారని ప్రభుత్వం తెలిపింది. ఏపీకి అపార అవకాశాలు ఉన్నాయిన ప్రపంచ ఆర్థిక సదస్సు వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాజ్ అన్నారు. ధాన్యాగారంగా పేరొందిన ఏపీ ఫుడ్ హబ్‌గా మారేందుకు అన్నిరకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో పలు చోట్ల ఆహార కొరత ఏర్పడుతున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించగలదన్నారు.
ఏపీలో కొత్తగా నిర్మిస్తున్న మూడు పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం అభివృద్ధిపై చర్చించారు. పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ అంశాన్ని సీఎం చర్చించారు. కొత్ తతరం పరిశ్రమలకు అవసరమైన మానవవనరులను తయారీ, నైపుణ్యాభివృద్ధికోసం ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ అంశాలపైనా సీఎం మాట్లాడారు. సోషల్ గవర్నెన్స్, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో డబ్ల్యూఈఎఫ్ వేదికద్వారా రాష్ట్రానికి మంచి ప్రయోజనాలు అందాలని సీఎం ఆకాక్షించారు. భవిష్యత్ తరాలను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి విద్య, వైద్యరంగాల్లో పెద్దమొత్తంలో ఖర్చుచేస్తున్నామని ఈ సమావేశంలో సీఎం వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికీ, వారి గడపవద్దకే సేవలను అందిస్తున్నామని వివరించారు.
డబ్ల్యూఈఎఫ్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికతను, కాలుష్యంలేని విధానాలను జోడించడానికి డబ్ల్యూఈఎఫ్ తగిన సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రాన్ని అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ప్రభుత్వంతెలిపింది. .నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన మానవనరుల తయారీ, స్థిరంగా ఉత్పత్తులు, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం లాంటి ఆరు అంశాల్లో ఈ ఒప్పందం ద్వారా వరల్డ్ ఎకనామిక్ ఫోరం రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తుంది.
బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్‌పాల్ బక్నర్‌తో సమావేశమ్యారు.
ఏపీ పెవిలియన్ పక్కనేమహారాష్ట్ర పెవిలియన్ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మ హారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తర్వాత ముఖ్యంత్రి అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్ గౌతం అదానీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. సీఎం జగన్ రెడ్డితో పాటు బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్, మిధున్ రెడ్డి, సీఎం కార్యలయ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి సీఎంతోపాటు అన్ని సమావేశాల్లో పాల్గొంటున్నారు.