జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనూ వెళ్లారు.. రానూ వచ్చారు. పార్లమెంట్ లో ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. అలాగే నిర్మలా సీతారామన్ తోనూ సమావేశం అయ్యారు. భేటీ ముగిసిన తర్వాత సీఎంవో పీఆర్వో వర్గాలు ఎప్పుడూ చెప్పే పడికట్టు పదాలు అయిన.. పోలవరం నిధులు.. కరెంట్ బకాయిలు అంటూ పాత మ్యాటర్ అంతా.. మళ్లీ అడిగారని చెప్పుకొచ్చారు. నిజానికి ఆయన ప్రధానితో ఈ విషయాల్లో ఒక్కటి కూడా ఆయన మాట్లాడి ఉండరని అందిరికీ తెలుసు.
మరి లోపం ఏం మాట్లాడారు ? ఖచ్చితంగా ఏపీ రాజకీయాలే మాట్లాడి ఉంటారని చెప్పాల్సిన పనిలేదు. టీడీపీ, జనసేన కూటమి వైపు వెళ్లవద్దని.. తనకు పాతిక సీట్లు వస్తాయని.. తానే నమ్మకమైన మిత్రపక్షమని ఆయన చెప్పేందుకు ప్రయత్నించి ఉంటారని భావిస్తున్నారు. అయితే ప్రధాని మోదీ స్పందన ఏమిటన్నదానిపై మాత్రం ఎవరికీ తెలియదు. నిర్మలా సీతారామన్ తో మాట్లాడి.. వచ్చే ఏడాది అప్పులు కూడా ఇప్పుడే తీసుకునే చాన్స్ గురించి మాట్లాడినట్లుగా తెలుస్తోంది ఎన్నికలకు ముందు పెండింగ్ పెట్టిన బటన్లు నొక్కాలంటే డబ్బులు కావాలి.. వాటి కోసం అప్పులు వెదుక్కుంటున్నారు.
అమిత్ షాతో భేటీ అయ్యేందుకు జగన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అపాయింట్ మెంట్ దొరకలేదు. షాతో భేటీ కోసమే ఒక రోజు ముదుగా ఆయన ఢిల్లీ వచ్చారని అంటున్నారు. కానీ షా తో భేటీ దొరకలేదు. పార్లమెంట్ లోనూ కలవలేకపోయినట్లుగా తెలుస్తోంది. ఈ అసహనంతోనే ఆయన వెనుదిరిగారని అంటున్నారు.