ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లి ప్రధానితో భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడలేదు. కానీ పలువురు కేంద్రమంత్రుల్ని కలవడంలో బిజీగా ఉన్నారు. మోదీతో భేటీ తర్వాత నిర్మలా సీతారామన్‌ను కూడా కలిశారు. కేంద్రమంత్రుల్నికలుస్తూనే ఉన్నారు. అయితే ఆయన అక్కడ కలుస్తూనే ఉన్న సమయంలో ప్రభుత్వ పీఆర్వో టీం ప్రధాని మోదీకి ఏమేం విజ్ఞప్తులు చేశారో ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. అయితే అవి ఎప్పుడు ప్రధానితో భేటీ అయినా విడుదల చేసే వివరాలే. ఈ సారి కొత్తగా బీచ్ శాండ్ కేటాయింపులు చేయాలని అడిగినట్లుగా చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలను ఆమోదించాలని.. బిల్లులు తర్వగా ఇవ్వాలని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని నిర్వాసితుల బ్యాంకు ఖాతాలకు బదిలీచేయాలన్నారు. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు సంబంధించి సైట్ క్లియరెన్స్ అప్రూవల్ ఇవ్వాలని అలాగే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించాలన్నారు. ఇక ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు బీచ్‌శాండ్ మినరల్స్ ప్రాంతాలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.16 చోట్ల బీచ్‌శాండ్ ఉన్న ప్రాంతాలను ఏపీఎండీసీకి కేటాయించాలని కోరారు. ఇటీవల పార్లమెంట్లో ఈ అంశంపై విజయసాయిరెడ్డి ప్రశ్న అడిగారు. అప్పుడు ఈ అంశంపై అక్రమాలు జరిగాయని విచారణ చేస్తున్నట్లుగాచెప్పారు.
ఇకఏపీలో నిర్మిస్తున్న పన్నెండు మెడికల్ కాలేజీలకు అనుమతులు వెంటనే ఇవ్వాలని జగన్ కోరారు. విభజన కారణంగా ఏర్పడిన లోటును భర్తీ చేయడం అదనపు రుణాలకు అనుమతిఇవ్వడం వరకూ పలు అంశాలనుప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ డిస్కంలు రూ.6,455.76 కోట్ల రూపాయలను ఏపీ జెన్కోకు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రాన్ని విభజించిన నాటినుంచీ జూన్ 2017 వరకూ తెలంగాణ డిస్కంలకు చేసిన విద్యుత్ పంపిణీకి సంబంధించి ఈమొత్తాన్ని ఇవ్వాల్సి ఉంది. ఈ డబ్బును ఇప్పించాల్సిందిగా కూడా ప్రధానిని జగన్ కోరారు.
అయితే ప్రతీ సారి ఇవే మాటలను పీఆర్వో టీం చెబుతూ ఉంటుంది. కానీ తర్వాత ఎప్పుడో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు లో ఇవేమీ ఉండవు. అప్పుల కోసం బ్యాంకులకుకేంద్రం రాసిన లేఖలు.. ఇతరఅంశాల్లో విజ్ఞప్తిచేసినట్లుగా చెబుతూ ఉంటారు. అందుకే ఈ సారి ఎవరైనా ఈ భేటీ వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా బయట పెట్టే వరకూ ప్రభుత్వం చెప్పిందే నిజమనుకోవాలి.