ప్రపంచ చాంపియన్ షిప్ సాధించిన పూసర్ల వెంక సింధుకు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు ఎకరాల నజరానాను ప్రకటించారు. విశాఖలో అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ఈ స్థలం కేటాయించనున్నారు. ప్రపంచ చాంపియన్ షిప్ సాధించిన తర్వాత తొలి సారి.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని… కుటుంబ సభ్యులతో కలిసి.. పీవీ సింధు కలిశారు. తను సాధించిన పతకాన్ని చూపించారు. ఈ సందర్భంగా… భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని.. సింధును జగన్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రాధికార క్రీడా సంస్థ ఆధ్వరంలో విజయవాడలోని తుమ్మల కళాక్షేత్రంలో పీవీ సింధు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
పీవీ సింధు వెంట.. తల్లిదండ్రులు, మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు కానీ… ఆమె కోచ్ గోపీచంద్ మాత్రం రాలేదు. పీవీ సింధు విజయంలో.. కోచ్ గోపీచంద్ పాత్ర కీలకం. గోపీచంద్ ఆకాడమీలోనే… సింధు… పూర్తి స్థాయిలో… టోర్నీలకు సిద్ధమవుతుంది. చిన్నప్పటి నుంచి ఆ అకాడమీలోనే… శిక్షణ పొందింది. అక్కడి కోచ్‌ల సహకారంలోనే అప్రతిహత విజయాలు సాధిస్తోంది. అందుకే.. తన విజయాల్లో… సింధు… ప్రధాన పాత్రను గోపిచంద్‌కు కేటాయిస్తుంది. ఎలాంటి కార్యక్రమంలో అయినా గోపీచంద్‌కు క్రెడిట్ ఇస్తుంది. కానీ..జగన్మోహన్ రెడ్డితో జరిగిన సమావేశానికి గోపీచంద్ హాజరు కాలేదు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ విషయంలో.. వైఎస్ హయాంలో… గోపీచంద్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు… కేటాయించిన స్థలాన్ని.. ఆకాడమ నుంచి వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇతరులకు కేటాయించాలనుకున్నారు. ఆ ప్రక్రియలో అప్పట్లో… వివాదాస్పదమయింది. చివరికి స్థలాన్ని వెనక్కి తీసుకోకుండా.. ఎలాగోలా.. గోపిచంద్ కాపాడుకోగలిగారు. ఆ అకాడమీ నుంచి ప్రపంచ స్థాయి ప్లేయర్లు బయటకు వచ్చారు. ఏ కారణంతో రాలేదో కానీ… గోపీచంద్ సీఎంతో సమావేశానికి రాకపోవడంతో.. ఈ అంశాలన్నింటినీ జర్నలిస్టులు గుర్తు చేసుకున్నారు.