జగన్ రెడ్డి గత ఎన్నికల్లో ఎన్ని మాయ మాటలు చెప్పి గెలిచారో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలు ఆశ చూపారు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అన్నారు. కానీ వాస్తవంగా ఏం జరిగింది. మొత్తం మసి. నిరుద్యోగుల జీవితాలు బుగ్గిపాలు అయ్యాయి. లక్ష,లు పెట్టి కోచింగ్ తీసుకుంటూ ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది.
ప్రతి ఏడాది డీఎస్సీ.. ముందుగా తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అని జగన్ ఊరూరా చెప్పారు. నాలుగున్నరేళ్లయింది. ఎన్నికలకు వెళ్లే సమయం వచ్చింది. ఇప్పుడు అసలు ఉపాధ్యాయ పోస్టులే ఖాళీ లేవంటున్నారు. అప్పుడో మాట ఇప్పుడో మాట చెబుతున్నారు., భర్తీ చేస్తారో లేదో చెప్పడంలేదు. అంతా గందరగోళం చేసి ఇప్పుడు… ఒక్క పోస్టు భర్తీ చేసే ఉద్దేశం లేదంటున్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేశారు. ఒకే టీచర్ ఉన్న పాఠశాలల్ని వేలకు చేర్చారు. అడ్డగోలు విధానాలతో పిల్లలకు చదువు అంటేనే విరక్తి చెందేలా చేస్తున్నారు. ఇప్పుడు అసలు ఉపాధ్యాయుల భర్తీనే చేపట్టడం లేదు. ‘
వాలంటీర్ లను ఉద్యోగాలు అని చెప్పి జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు. పదిహేను వేల జీతంతో సచివాలయ ఉద్యోగుల్ని తీసుకుని బండ చాకిరి చేయించుకుని… అతి కష్టం మీద రెగ్యులరైజ్ చేసి.. చట్టబద్దంగా ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సినవేవీ అందకుండా కొత్త రూల్స్ తెచ్చారు. వారి పరిస్థితి వారికే అర్థం కావడం లేదు. పోలీసు ఉద్యోగాల భర్తీ కూడా లేదు. చివరికి ఏపీ యువత… అయితే వాలంటీర్లు లేకపోతే పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితిని సృష్టించారు.