కనుచూపు మేరలో సముద్రం. ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండే వాతావరణం. హాయిగా వీచే పిల్లగాలి.. బాల్కనిలో నిలబడినా… పది అంతస్తుపై ఉన్నట్లుగా.. అనిపించే ఎత్తైన ప్రదేశంలో ఇల్లు ఉంటే.. ఎంత బాగుంటుంది..? బహుశా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా అలాంటి ఫీలింగ్సే ఉండి ఉండవచ్చు. విశాఖలో ఆయన సొంత ఇంటి కోసం.. స్థల పరిశీలన చాలా చురుగ్గా సాగుతోంది. ఆయనకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ఈ విషయంలో.. కొన్ని పారామీటర్స్ రెడీ చేసుకుని.. ఆ దిశగా సెర్చింగ్ ప్రారంభించారు. వారి దృష్టి అంతా.. విశాఖ శివార్లలోని కొండలపైనే ఉంది. కొండపై సీఎం నివాసం ఉంటే భద్రతాపరంగా కూడా.. ఎంతో అనుకూలమని.. సహజసిద్ధమైన భద్రత ఉంటుందని కూడా లెక్క వేసుకున్నారంటున్నారు. ప్రస్తుతం రుషికొండ, మధురవాడ, భీమిలి, కాపులుప్పాడ, తిమ్మాపురం తదితర ప్రాంతాల్లో స్థలాల కోసం అన్వేషిస్తున్నారు.
ఎక్కడ అనుకూలంగా దొరికితే.. అక్కడ నిర్మాణాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఇంటిని శరవేగంగా పూర్తి చేయాలని.. తెలంగాణ సీఎం ప్రగతి భవన్ ఖర్చు రూ. ఐదు వందల కోట్లుఅయినా… ఐదారు నెలల్లోనే పూర్తపోయింది. అదే తరహాలో పూర్తి కావాల్న పట్టుదలను.. జగన్ సన్నిహితులు ప్రదర్శిస్తున్నారంటున్నారు. అయితే.. ఈ నివాసం.. పూర్తిగా.. వ్యక్తిగత ఖర్చుతో నిర్మిస్తారా.. ప్రజాధనాన్ని వినియోగించి.. ముఖ్యమంత్రి నివాసంగా ప్రకటించి నిర్మిస్తారా అన్నదానిపై మాత్రం… ఇంకా క్లారిటీ లేదు. జగన్మోహన్ రెడ్డికి సొంత ఇళ్లు అంటేనే ఇష్టం. ఆయన పలు చోట్ల ఎంత ఖర్చు అయినా సొంత ఇళ్లే నిర్మించుకున్నారు.
విశాఖలోనూ ఆయన సొంతంగా స్థలం కొని.. ఇల్లు నిర్మించుకుంటారని చెబుతున్నారు. అయితే.. కొంత మంది మాత్రం.. విశాఖలో మాత్రం.. జగన్ ప్రజాధనంతోనే… రూ. నాలుగు ఐదువందల కోట్లు అయినా సరే ఖర్చు పెట్టి ఇంటిని నిర్మించుకుంటారని అంటున్నారు. మొత్తానికి.. రాజధానిపై క్లారిటీ వచ్చేసిన వెంటనే.. జగన్ ఇంటి నిర్మాణం కూడా ప్రారంభమయ్యేలా.. ఏర్పాట్లు మాత్రం చకచకా సాగుతున్నాయి.