జగన్ టార్గెట్ గా దూకుడు పెంచుతున్న వైఎస్ షర్మిలను ఎదుర్కొనే విషయంలో వైసీపీ నానా తంటాలు పడుతోంది. ఒకరిద్దరూ నేతలు షర్మిలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా..ఈ ఎపిసోడ్ లో షర్మిలదే పైచేయిగా నిలుస్తోంది. దీంతో షర్మిలను ఎదుర్కొనే విషయంలో వైసీపీ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
షర్మిల విమర్శలపై స్వయంగా జగన్ నోరు మెదపలేని స్థితిలో ఉన్నారు. సజ్జలవంటి నేతలు గతంలో ఆమెపై విమర్శలు గుప్పించినా ఇప్పుడు ఆయన సైలెంట్ అయ్యారు. పేర్ని నాని ఒక్కరే షర్మిలకు కౌంటర్లు ఇస్తున్న ఆయన బలం సరిపోవడం లేదు. షర్మిల విషయంలో ఇంకా మెతక వైఖరి అవలభిస్తే పార్టీకి నష్టం వాటిల్లుతుందని అధినాయకత్వం భావిస్తోందన్న టాక్ నడుస్తోంది.
షర్మిలను ధీటుగా ఎదుర్కొనేందుకు మహిళా నేతలు అయితేనే బాగుంటుంది అనేది వైసీపీ ఆలోచన. గతంలో మంత్రులు పని చేసిన రోజా, విడదల రజిని, తానేటి వనిత, పుష్ప శ్రీవాణిలుతోపటు మహిళా కమిషన్ చైర్మన్ గా పని చేసిన వాసిరెడ్డి పద్మ కూడా షర్మిల చేస్తోన్న విమర్శలపై మౌనంగానే ఉంటున్నారు.
దీంతో షర్మిలకు కౌంటర్ ఇచ్చేందుకు మహిళా గొంతుక వైసీపీకి అవసరం అని , జగన్ తన భార్య చేత రాజకీయ అరంగేట్రం చేయించాలి అనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. వైఎస్సార్ కోడలిగా ఆమెను జనంలోకి పంపేలా భారీ ప్రణాళికలను రచిస్తున్నారు అని అంటున్నారు.