వైఎస్ వివేకానందరెడ్డి మా బాబాయి..ఆయనతో మా అనుబంధం వెలకట్టలేనిదని జగన్ రెడ్డి బ్యాచ్ హత్య తర్వాత పుంఖాను పుంఖాలుగా కథలు రాశారు. అప్పట్లో వైఎస్ అవినాష్ రెడ్డి ఓ విగ్రహం కూడా ఆవిష్కరించారు. కానీ ఆయన వర్థంతి వస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా నివాళులు అర్పించలేదు. పులివెందులలో ఆయన సమాధి వద్ద ఆయన కుమార్తె, అల్లుడు మాత్రమే నివాళులు అర్పించారు. వైఎస్ కుటుంబంలో కొంత మంది వ్యక్తులు మాత్రమే ఈ నివాళులు అర్పించారు. జగన్ తో , అవినాష్ రెడ్డితో సాన్నిహిత్యం ఉన్న వారెవరూ రాలేదు.
వివేకానందరెడ్డి చనిపోయారు. చనిపోయే వరకూ ఆయనతో అనుబంధం ఉంటే కనీసం నివాళులు అర్పించేవారు. ఆ పని చేయలేదు. కుటుంబానికి పెద్దగా మారి కుటుంబాన్ని చిన్నభిన్నం చేసిన జగన్ రెడ్డి వ్యక్తిత్వం అలాంటిది కాదు. ఆయన వైఎస్ వివేకానందరెడ్డికి ఎందుకు వ్యతిరేకమో వారికే తెలియాలి. ఆయనను ఎంపీ పదవికి రాజీనామా చేయాలని కొట్టాలన్న ప్రచారమూ ఉంది. చివరికి ఆయన హత్య విషయంలోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వైఎస్ సునీత తన తండ్రిని చంపిన వారికి శిక్షలు పడేలా పోరాటం చేస్తున్నారు. చివరికి ఆమెపైనే తండ్రి హత్యకేసును రుద్దాలనుకున్నారు. ఇంత క్రూరమైన మైండ్ సెట్ ఉన్నవారితో సునీత పోరాడుతున్నారు. వారు వివేకానందరెడ్డికి నివాళులు అర్పించడం.. గౌరవం ఇస్తారనుకోవడం అత్యాశే అనుకోవచ్చు. అయితే ఇలా వ్యవహరించడం ద్వారా వివేకా కేసులో వారి పాత్రపై అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉంది.