భారతరత్న అబ్దుల్ కలామ్ను అవమానిస్తూ జారీ అయిన జీవోపై.. సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ.. దానికి సంబంధించి ఎవరిపై వేటు వేశారో… మాత్రం.. ఇంకా క్లారిటీ లేదు. తను చెప్పిన జీవోలు జారీ చేయలేదని.. తనకు చెప్పకుండానే జీవోలు జారీ చేస్తున్నారనే కారణంగా..ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపైనే వేటు వేశారు సీఎం జగన్. అలాగే.. ఓ మహనీయుడ్ని అవమానిస్తూ.. జారీ అయిన జీవోపై.. ప్రజాగ్రహం చూసిన తర్వాత తాను సీరియస్ అయ్యారు కానీ… ఆ జీవో జారీ చేసిన అధికారిపై ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మీకు తెలియకుండా.. జీవో జారీ అయితే.. తక్షణం.. ఆ జీవో జారీ చేసిన అధికారిపై చర్యలు తీసుకోవాలని..,జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా సింపుల్ సవాల్ విసిరారు.
ఆ తర్వాత ఆ జీవోను ఉపసంహరించుకుంటున్నట్లుగా.. ప్రభుత్వం ప్రకటన చేసింది కానీ.. దానికి బాధ్యులెవరు అన్నదానిపై ఇంత వరకూ యాక్షన్ తీసుకోలేదు. అయితే.. సెక్రటేరియట్ వర్గాలలో జరుగుతున్న ప్రచారం.. ప్రకారం.. ఆ నిర్ణయం సీఎంవోలోనే జరిగింది. చీఫ్ మినిస్టర్ ఆఫీసులోని ఉన్నతాధికారుల ఆమోదం తర్వాత ఆ జీవో బయటకు వచ్చింది. అందుకే.. జీవో వివాదాస్పదం అయ్యే వరకూ.. ఎవరూ స్పందించలేదు. తీరా ఓ మహనీయుడ్ని అవమానించారన్న ప్రచారం.. ప్రారంభమైన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి.. నష్ట నివారణ చర్యలకు దిగారు. తాను ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కవర్ చేసి.. జీవోను వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు.
ఎల్వీ సుబ్రహ్మణ్యం విషయంలో అంత వేగంగా స్పందించిన సర్కార్.. ఓ మహనీయుడ్ని అవమానించిన అధికారి విషయంలో.. స్పందించకపోవడంతోనే… అసలు.. ఇదంతా.. ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరిగిందనే అభిప్రాయం ప్రజల్లో బలపడటానికి కారణం అవుతోంది. ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లో.. ఒక్కటంటే.. ఒక్క పనీ చేయకపోయినా.. ప్రభుత్వ పథకాలు.. కార్యాలయాలు అన్నింటికీ… రంగులు వేసుకోవడానికి.. పేర్లు మార్చుకోవడానికి మాత్రం పూర్తి సమయం కేటాయిస్తోంది. ఈ క్రమంలో… ప్రజల్లో పలుచనవుతోంది. కానీ వెనక్కి మాత్రం తగ్గడం లేదు.