ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి సీఎం జగన్ డుమ్మా కొడుతున్నారు. దానికి కారణం ఆ సమావేశంలో చంద్రబాబు కూడా పాల్గొననుండటమే. జగన్మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్తున్నారు. అయితే “అజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ” సమావేశంలో పాల్గొనడం లేదు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగే ఈ కమిటీ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటున్నారు. కమిటీలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ కూడా పాల్గొనాల్సి ఉంది. పాల్గొంటారని కూడా అనుకున్నారు.
కానీ ఆ సమావేశానికి డుమ్మా కొట్టాలన్న ఉద్దేశంతో ఆలస్యంగా ఢిల్లీ వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. సాయంత్రం 4:30 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రధాని నేతృత్వంలో జరిగే.. ఆజాదీకా మహోత్సవ్ కమిటీ భేటీ జరుగుతుంది. కానీ జగన్ రాత్రి 7:30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. ఆదివారం రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ నిర్వహించే.. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో జగన్ పాల్గొనంటారు. చంద్రబాబు ఉన్న సమావేశంలో జగన్ పాల్గొనడం అసాధ్యమన్న వాదన కొద్ది రోజులుగా వినిపిస్తోంది.
ఆయనను ఫేస్ చేయలేరని టీడీపీ నేతలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు అదే నిజమన్నట్లుగా మోదీ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికీ గైర్హాజర్ అవుతున్నారు. ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం జగన్ కూడా ప్రధాని మోదీపై పరోక్షంగా విమర్శలు చేస్తూండటం.. విజయసాయిరెడ్డి పార్లమెంట్లో బయట కూడా కేంద్రం తీరును ప్రశ్నిస్తూండటంతో బీజేపీతో వైఎస్ఆర్సీపీ దూరం జరిగే ప్రయత్నం చేస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే బీజేపీతో గొడవ పెట్టుకునేంత సీన్ వైసీపీకి లేదంటున్నారు.