ఏపీ సీఎం జగన్ మరోసారి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై 2014లో నమోదైన కేసు కొట్టి వేయాలని కోరారు. అయితే ఈ కేసు.. అక్రమాస్తులకేసు కాదు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు. 2014 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీఅభ్యర్థి తరపున నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేశారు ఆ సమయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లుగా అధికారులు కేసులు నమోదు చేశారు. ఆ కేసులపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా నిందితులను 28వ తేదీన హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు అందలేదన్న కారణం చూపి జగన్ హాజరు కాలేదు.
దీంతో ఖచ్చితంగా నోటీసులను 31వ తేదీలోపు అందించాలని ఆదేశించింది. అయితే ఈ లోపే సీఎం జగన్ తనపై కేసు కొట్టేయలని హైకర్టును ఆశ్రయించారు. ప్రజాప్రతినిధులపై ఉన్నకేసులను ఏడాదిలోపు తేల్చాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. నాంపల్లిలో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కేసులను త్వరగా పరిష్కరిస్తోంది. ఇటీవలి కాలంలో పలువురు ప్రజాప్రతినిధులకు జరిమానాలు, శిక్షలు ఖరారు చేస్తోంది. మరికొన్ని కేసుల్లో చురుగ్గా విచారణ జరుగుతోంది. కొంత మంది ప్రజాప్రతినిధులు తమ కేసుల నుంచి బయట పడుతున్నారు. ఎక్కువగా ఎన్నికల నియమావళికి సంబంధించిన కేసులే పరిష్కారమవుతున్నాయి.
ఈ క్రమంలో తనకు శిక్ష పడుతుందని అనుకున్నారేమో కానీకేసు కొట్టి వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇంత కాలం పట్టించుకోకుండా ఇప్పుడు విచారణకు రమ్మంటే హైకోర్టులో కేసు కొట్టి వేయాలనిజగన్ పిటిషన్ వేయడం న్యాయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. విచారణను ఆలస్యం చేసే పాత వ్యూహమే అమలు చేస్తున్నారని భావిస్తున్నారు.