ప్రధానమంత్రి నరేంద్రమోడీని మరోసారి ఏపీకి ప్రత్యేకహోదా కావాలని జగన్మోహన్ రెడ్డి అడిగారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ఆన్ లైన్ పద్దతిలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రులు అందరూ పాల్గొన్నారు. పంచవర్ష ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసిన తర్వాత ఆరో సమావేశం. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు వచ్చింది. విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని.. ప్రత్యేకహోదా ఇస్తేతప్ప పారిశ్రామిక రంగంలో ముందుకెళ్లలేమని జగన్ ప్రధానికి వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో కూడా హామీ ఇచ్చారని జగన్ మోడీకి గుర్తు చేశారు. ఇతర అంశాలపై కూడా మాట్లాడారు. అనేక సలహాలిచ్చారు. దేశ ఆర్థిక వృద్ధికి ఏం చేయాలో సూచనలు కూడా ఇచ్చారు.
అయితే జగన్ ప్రసంగంలో ప్రత్యేకహోదా మాత్రమే హైలెట్ అవుతోంది. ప్రత్యేకహోదాను కేంద్రం మెడలు వచ్చి తీసుకు వస్తామనిగతంలో జగన్ చెప్పేవారు. అందుకే రెండేళ్లయినా ఆయన ప్రత్యేకహోదా తీసుకురాలేకపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం ఆయన కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడగడం లేదంటున్నారు. ఇలాంటి సమయంలో… వీడియో కాన్ఫరెన్స్‌లో అందరూ చూస్తూండగానే ప్రధానమంత్రి వింటున్న ప్రసంగంలో ప్రత్యేకహోదాను ప్రస్తావించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా కోసం తన ప్రయత్నాలను తాను సిన్సియర్‌గా చేస్తున్నారని… వైసీపీ నేతలు ప్రచారం ప్రారంభించారు.
నిజానికి నీతి ఆయోగ్ సమావేశం ఆరోసారి జరుగుతోంది. ఆరు మీటింగుల్లోనూ ఏపీ సీఎంలు పాల్గొన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నేరుగా సమావేశాలు జరిగేవి. అప్పుడు ఆయన నేరుగానే ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావించేవారు. అప్పుడు కానీ.. ఆ తర్వాతకానీ ఎప్పుడూ నీతి ఆయోగ్ సమావేశంలో చెప్పారు కదా అని దాన్ని పరిశీలించలేదు.కానీ .. ప్రభుత్వం ఓ విజ్ఞప్తి చేసినట్లుగా ఉంటుంది. ఓ ప్రయత్నం చేసినట్లుగా ఉంటుంది. ప్రస్తుతం కేంద్రం ఎవరికీ ప్రత్యేకహోదా ఇవ్వట్లేదని చెబుతోంది. ఇచ్చే అవకాశం లేదని ఏపీ బీజేపీ నేతలు కూడా కుండబద్దలు కొడుతున్నారు. అయినా సీఎం జగన్ .. తన ప్రయత్నం తానుచేస్తున్నారు.