బైజూస్ పని అయిపోయిందని టెక్ ఎడ్యూకేషన్ ఇండస్ట్రీ గగ్గోలు పెడుతూంటే… ఆ బైజూస్ ను పట్టుకుని ఈదాలని ఏపీ విద్యార్థులను ఏపీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. తాజాగా ఇంటర్ విద్యార్థులకూ బైజూస్ కంటెంట్ అందించేలా ఒప్పందం చేసుకుంటామని మంత్రి బొత్స ప్రకటించారు. రెండు మూడు రోజుల్లోనే ఒప్పందం ఉంటుందని ఆయన ప్రకటించారు. అంటే ఇప్పటికే బేరాలు అయిపోయాన్నమాట.
బైజూస్‌ను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వ పెద్దలు … ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయానికి మించి రెండింతలు నష్టాలు చూపిస్తూ… అప్పులు తీసుకున్న వారికి ఎగ్గొట్టి కేసుల్లో ఇరుక్కున్న బైజూస్ .. ఇప్పుడు కార్యకలాపాలు నిర్వహించలేని స్థితికి చేరుకుంది. ఉత్యధికంగా ఉద్యోగుల్ని తొలగిస్తోంది. నామ మాత్రంగానే ఉద్యోగులు ఉన్నారు. బైజూస్ కంటెంట్ పై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అది ఎందుకూ పనికి రాదని టీచర్లు కూడా చెబుతూ ఉంటారు. మరీ ఏపీ ప్రభుత్వానికి ఎందుకు అంత ఇంట్రస్ట్ అన్నది వారికి మాత్రమే తెలిసిన విషయం.
బైజూస్ తో ఎలాంటి కార్యకలాపాలను… ఒప్పందాలను ప్రభుత్వాలు చేసుకోవడం లేదు. అసలు లక్షల మంది టీచర్లు ప్రభుత్వానికి ఉండగా.. పాఠ్యాంశాల రూపకల్పన కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండగా… బైజూస్ కంటెంట్ కొనాలనుకోవడమే పెద్ద విచిత్రం. ఇందులోనే పెద్ద స్కాం ఉందని అర్థమైపోతుంది. దీన్ని అంతకంతకు పెంచుకుంటూ పోవడమే బరితెగింపు పాలకు నిదర్శనం.