వాలంటీర్లే లేరు – జగనే క్లోజ్ చేశారు !

వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు ఏపీలో ఉందా అంటే లేదు. జగన్ రెడ్డి హయాంలోనే తీసేశారు. ఆయన హయాంలోనే వాలంటీర్ల గడువు ముగిసింది. పొడిగింపునకు ప్రత్యేక జీవో జారీ చేయలేదు. దీంతో వారి సర్వీసులు ముగిసిపోయినట్లయింది. రాజీనామాల పేరుతో వారితో ఎన్నికల సమయంలో నాటకం ఆడించారు. గత ఏడాది ఆగస్టులో వాలంటీర్లను నియమించుకున్నప్పుడు చేసుకున్న ఒప్పందం పూర్తయిపోయింది. కొనసాగిస్తేనే జీతాలివ్వగలమని అధికారులు చెప్పినా … జగన్ రెడ్డి పట్టించుకోలేదు. వాలంటీర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి ఆ ఒప్పందం కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేదు. అంటే గత ఏడాది ఆగస్టుతోనే వాలంటీర్ల వ్యవస్థ మూతబడిపోయింది.

వాలంటీర్లు అంతా తమ పార్టీ వారేనని వైసీపీ నేతలు చెప్పుకుంటారు. అంతే కాదు వారందర్నీ జగన్ రెడ్డి సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో ఓటర్లను బెదిరించడానికి కూడా ఉపయోగించుకున్నారు. ఇక సాధారణ ఎన్నికల సమయంలో చెప్పాల్సిన పని లేదు. ఐదేళ్ల పాటు ప్రజాధనం రూ. ఐదు వేలు ఇచ్చి… వారితోనే తన సాక్షి పత్రికకు వందల కోట్లు దోచి పెట్టుకుని ఎంత అరాచకం చేయాలో అంత చేశారు. కానీ వారి భవిష్యత్ కు గ్యారంటీ ఇవ్వలేకపోయారు. రాజకీయ చాన్సులిస్తానని.. అదనీ..ఇదనీ అదరగొట్టారు కానీ.. వారి కుటుంబాలకు భరోసా ఇవ్వలేకపోయారు. చివరికి ప్రభుత్వం మారితే సమస్యలు వస్తాయని తెలిసినా.. వారికి పొడిగింపు జీవోలు కూడా ఇవ్వలేదు.

వాలంటీర్లకు ఎలాంటి అవకాశాలు కల్పించాలన్నదానిపై ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తోంది. మొత్తం రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వైసీపీ కోసం రాజీనామాలు చేసి ఆ పార్టీ కోసం పని చేసిన వారి సంఖ్య లక్ష వరకూ ఉంటుంది. మిగిలిన వారు రాజీనామాలకు నిరాకరించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుండి వారికేమీ పనులు చెప్పడం లేదు. అందుకే జీతాలు రావడం లేదు. చాలా మంది వాలంటీర్లు తమకు చేతనైన పనులు చేసుకుంటున్నారు. రాజీనామాలు చేయని వారికి మూడు నెలల జీతాలు ఇచ్చే ప్రతిపాదన కేబినెట్ లో చర్చించినప్పటికీ.. వారి సేవలు పొడిగింపుపై ఉత్తర్వులు లేనందున ఏ ఖాతాలో ఇచ్చినా అది చట్టవిరుద్ధమే కాబట్టి.. ఏ చేయాలన్నదానిపై పరిశీలన చేయలని నిర్ణయించారు.

జగన్ రెడ్డి తనను నమ్ముకున్న వాళ్లందర్నీ ముంచారు. చివరికి వాలంటీర్లను కూడా. అంతిమంగా ఆయన స్వార్థం చేసుకున్నారు.. తన కోసం పని చేసిన వారందర్నీ డ్రైనేజీలో కలిపేస్తున్నారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

అడియోస్ అమిగో రివ్యూ: అపరిచితుల జీవయాత్ర

సినిమా అనగానే ఇంట్రడక్షన్, పాటలు, ఫైట్లు, స్క్రీన్ ప్లే లో త్రీ యాక్ట్.. ఇలా కొన్ని లక్షణాలు ఫిక్స్ అయిపోతాయి. కానీ అప్పుడప్పుడు ఆ రూల్స్ ని పక్కన పెట్టి కొన్ని చిత్రాలు...

తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం- ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన టీడీపీ

తిరుమ‌ల వెంక‌న్న ల‌డ్డూ ప్ర‌సాదం అంటే ఎంతో సెంటిమెంట్. క‌ళ్ల‌కు అద్దుకొని తీసుకుంటారు. వెంక‌న్న‌ను ద‌ర్శించుకున్నంతగా భావిస్తారు. కానీ ఆ ల‌డ్డూ త‌యారీలో వాడిన నెయ్యిని గొడ్డు మాసం కొవ్వుతో త‌యారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close