జగన్మోహన్ రెడ్డి బస్సుయాత్ర చేస్తున్నారు. అంతా ఓ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతోంది. అయితేఈ స్క్రిప్ట్లోనే కొత్తదనం చూపించలేకపోతున్నారు ఐ ప్యాక్ క్రియేటర్లు. గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఎలాంటి స్ట్రాటజీని అమలు చేశారో అదే అమలు చేస్తున్నారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను అధికారంలోకి వస్తే అది చేస్తా.. ఇది చేస్తా అని హామీ ఇచ్చినట్లుగా… బాధితుల్ని. వికలాంగుల్ని.. పిలిపించుకుని ఆడే గేమ్ లాగేనే ఇప్పుడూ ఆడుతున్నారు. కానీ ఇప్పుడు జగన్ ఐదేళ్లుగా సీఎంగా ఉన్నారన్న సంగతిని స్ట్రాటజిక్గా మర్చిపోయారు.
ప్రస్తుతం జగన్ ను కలుస్తున్న వారిలో ఐదేళ్లకిందట కలిసిన వారు కూడా ఉన్నారు. వారు ఇప్పుడు కూడా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఆయన కూడా మళ్లీ తాను సీఎం అవగానే పరిష్కారమవుతాయంటున్నారు. అంటే..గత ఎన్నికలలో ఓట్లేయించుకుని మళ్లీ ఓట్ల కోసమే తమను పిలిపించుకున్నారని వారికీ అర్థమవుతుంది. చూసే వారికీ తెలుస్తుంది. ఇదే స్ట్రాటజీ బస్సు యాత్ర మొత్తం అమలు చేస్తున్నారు.
బస్సు యాత్రలో జగనమోహన్ రెడ్డి తాను చేసిన అభివృద్ధి దగ్గర నిల్చుని ఓ సెల్ఫీ దిగి పోస్టు చేస్తే బాగానే ఉంటుంది.. కానీ అలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి ఆలోచనే లేదు. కానీ బాధితుల్ని తీసుకొచ్చి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మరి ఈ ఐదేళ్లలో చేసిందేమిటనే ప్రశ్న చూసే వాళ్లకు వస్తుంది కదా అంటే.. అలాంటి డౌట్.. ఐ ప్యాక్ వారికి రావడం లేదు.
తాను ఐదేళ్లు అధికారంలో లేనని ప్రతిపక్ష నేతగా ఉన్నానన్నట్లుగా జగన్ వ్యవహారశైలి ఉంది. ప్రచార శైలి అలాగే ఉంది. కానీ ప్రజలు… ఆయన పాలన ఉండాలా వద్దా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఓట్లు వేస్తారన్న సంగతిని మర్చిపోతున్నారు. జగన్ ప్రచార వ్యూహంలో అతి పెద్ద లోపంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.