ప్రధాని నరేంద్రమోడీ.. ఏపీ పర్యటనకు వచ్చారు. ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం.. గవర్నర్ నరసింహన్, సీఎం జగన్ తో పాటు .. మంత్రులు, ఇతర బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ … తనకు అలవాటైన పద్దతిలో స్వాగతం పలికారు. తర్వాత జగన్ వంతు. చేతిలో ఉన్న చిన్న పువ్వును చేతిలో పెట్టారు. అంత వరకూ బాగానే ఉంది.. ఆ తర్వాత భయంతో కూడిన గౌరవంతో తెచ్చిపెట్టుకున్న వినయంతో.. మోకాళ్లపైకి వంగిపోయారు. ఒక సారి కాదు.. రెండు సార్లు .. దాదాపుగా నాలుగు సార్లు… అలా మోకాళ్లపైకి వంగి… మోడీకి పాదనమస్కారాలు చేయబోయారు నాలుగు సార్లు.. మోడీ ఆపారు. ఆప్యాయంగా భుజం తట్టి.. మళ్లీ అక్కడే ఏమైనా మాట్లాడితే.. మళ్లీ వంగుతారనని అనుకున్నారేమో కానీ.. పక్క మంత్రి వద్దకు వెళ్లిపోయారు.
పడేకొద్దీ పడాలనిపించిందా..?
స్వాగతం చెప్పడానికి బీజేపీ నేతలు కూడా వచ్చారు. కానీ ఏ ఒక్కరూ.. మోడీకి మోకాళ్ల మీద నమస్కారాలు చేయాలని ప్రయత్నించలేదు. అందరూ హుందాగా… చేతికి పువ్వు ఇచ్చి… ఓపిక ఉన్న వాళ్లు శాలువాలు కప్పారు. ఓ నేత .. ఓ భక్తి పుస్తకాన్ని అందించి తన భక్తిని చాటుకున్నారు. కానీ.. జగన్మోహన్ రెడ్డి మాత్రం.. అందరి కంటే.. ఎక్కువ వినయం ప్రదర్శించారు. “పెళ్లాం ఊరెళితే” సినిమాలో వేణు చెప్పినట్లు.. “పడే కొద్దీ పడాలనిపిస్తోందనే” డైలాగ్ గుర్తొచ్చేలా… జగన్మోహన్ రెడ్డి తీరు ఉండటంతో సోషల్ మీడియాలో ఆ వీడియోలో వైరల్ అయిపోయింది. గతంలో.. జగన్మోహన్ రెడ్డి చెప్పిన సీమ పౌరుషం డైలాగుల దగ్గర్నుంచి… ప్రత్యేకహోదా విషయంలో… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ప్రకటన వరకూ అన్నీ బయటకు తీసి… ఆ వీడియోకు జతగా.. జాయింట్ చేసి.. వైరల్ చేస్తున్నారు.
సాక్షి ఎడిట్ చేసి మరింత పరువు తీసేసిందా..?
జగన్ మోహన్ రెడ్డి అతి వినయం.. వ్యతిరేక పార్టీల వాళ్లకే కాదు.. చివరికి సొంత పార్టీ.. సొంత మీడియా వాళ్లకి కూడా షాకిచ్చినట్లుగా ఉంది. అందుకే… మోడీకి జగన్ స్వాగతం చెప్పిన వీడియోను.. పక్కాగా ఎడిట్ చేశారు. అంత షాకింగ్… వినయాన్ని జగన్ ప్రదర్శిస్తారని.. వాళ్లు కూడా అనుకోలేదు కాబట్టి.. లైవ్ ఇచ్చేశారు. తర్వాత ప్రసారం చేయాల్సిన దాంట్లో… పదే పదే మోకాళ్లు వంచే దృశ్యాలను … కట్ చేసేశారు. కేవలం..నిటారుగా నిలబడి.. పువ్వు ఇస్తున్న విజువల్స్… మోడీ భుజం తడుతున్న విజువల్స్ మాత్రమే ప్రసారం చేస్తున్నారు. చివరికి యూ ట్యూబ్లోనూ అవే ఉంచారు. సాక్షి తీసేసినంత మాత్రాన… జనం చూడకుండా ఉంటారా.. అంటే.. అది.. వాళ్ల బాధ్యత..! తమ ఓనర్ పరువు ను .. తమకు చేతనైనంతలో కాపాడటం వారి బాధ్యత.. అందుకే అలా చేశారు.
అతి వినయం… !
నిజానికి… ఇలా చేయడం వల్ల… జగన్ ఇమేజ్ను సాక్షి సిబ్బంది ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేశారు. మామూలుగా వదిలేసినట్లయితే.. కాస్త.. ఎదురు దాడి చేసి.. పెద్ద మనిషి.. ఆశీర్వాదం తీసుకుంటే తప్పేముందని కవర్ చేసుకునేవాళ్లు. ఇప్పుడు.. సాక్షి మీడియా ఆ దృశ్యాలన్నింటినీ ఎడిట్ చేయడం వల్ల.. జగన్మోహన్ రెడ్డి.. ఏదో తప్పు చేశాడనే భావన ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఎదురు దాడి చేయడానికి కూడా ఏమీ లేకుండా పోయింది..! ” అతి వినయం…. ” అనే నానుడి ఉంది మరి..!