మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉంటుందో లేదో కానీ.. జగన్ రెడ్డికి సంబంధించిన చాలా వ్యవహారాలు ఆయన పీఏ నాగేశ్వర్ రెడ్డి దగ్గర ఉండటం ఖాయం అనుకోవచ్చు. ఇప్పుడీ నాగేశ్వర్ రెడ్డి తాను చేసిన బినామీ దందాలతో పోలీసుల వలలో చిక్కుకున్నారు. చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరి అనే జబర్దస్త్ ఆర్టిస్టును అడ్డం పెట్టుకుని ఆయన చేసిన దందాలు వెలుగులోకి వచ్చాయి. గన్నవరం మాజీ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ పోలీసు కస్టడీలో అన్ని వివరాలు చెబుతున్నారు. ఆధారాలు కూడా ఇస్తున్నారు. దాంతో అసలు జరిగిన కథేమిటో వెలుగులోకి వస్తోంది.
మరో వైపు అటు చీమకుర్తి శ్రీకాంత్ మీడియాకు ఇంటర్యూలు ఇచ్చి తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానని.. సబ్ రిజిస్ట్రార్లతో పరిచయాలు , డబ్బు లావాదేవీలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఆయన తీరు చూస్తే.. బినామీ అని ఎవరికైనా అర్థం అయిపోతుంది. రీతూ చౌదరితో పరిచయం చేసుకుని ఆమెను కొంత కాలం వెంట తిప్పుకున్నారు. పెళ్లి పేరుతో పార్టీలకు తిప్పారు. కొన్ని బినామీ ఆస్తులు ఆమె పేరుపై పెట్టారు. తర్వాత ఏం జరిగిందో కానీ ఇద్దరం దూరమయ్యామని.. సంబంధాలు లేవని రీతూ చౌదరి అలియాస్ వనం దివ్య చెబుతున్నారు.
తాము బాగున్నప్పుడు అసలేం జరిగేదో.. వనందివ్య మీడియాకు చెబుతున్నారు. జగన్ పీఏ నాగేశ్వర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి నేరుగా ఇలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్లతో బినామీ వ్యవహారాలు చేసి వందల కోట్లు సంపాదించారని చెబుతున్నారు. పోలీసులు ధర్మసింగ్ దగ్గర నుంచి సేకరించే పూర్తి వివరాలతో కేసులు కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో జగన్ రెడ్డి ఇటు లండన్ వెళ్లగానే అటు పీఏ నాగేశ్వర్ రెడ్డిని ఎత్తేసి … అసలు గుట్టు అంతా బయటకు తీస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది.