తూర్పుగోదావరి జిల్లా జగన్ పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది . కిర్లంపూడి మండలం , గోనేడ లో జగన్ పాదయాత్ర కొనసాగుతుండగా కాపులు జగన్ పాదయాత్ర నిర్వహించారు అడ్డగించారు. అయితే కాపు ఆందోళనకారులను జగన్ భద్రతా సిబ్బంది నెట్టివేయడంతో పాదయాత్రలో గందరగోళం ఉద్రిక్తత నెలకొంది.
గోదావరి జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కాపు రిజర్వేషన్లు తాము ఇవ్వలేనని చెప్పాలని జగన్ కి ఎందుకు అనిపించిందో తెలియదు కానీ, జగన్ కాపు రిజర్వేషన్లు జాతీయ పరిధిలో అంశం కాబట్టి తాను ఏమీ చేయలేనని వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్రంలో సెగలు రేపుతోంది. ఈ వ్యాఖ్యలను ముద్రగడ పద్మనాభం సహా కాపు జేఏసీ నేతలు వరుసగా ఖండించడం ప్రారంభించారు. ముద్రగడ అయితే జాతీయ పరిధిలో ఉన్న ఎన్నో ఇతర అంశాల మీద పోరాటం చేస్తున్న జగన్ కేవలం కాపు రిజర్వేషన్ల అంశం మాత్రమే ఆ సాకుతో పక్కన పెట్టడం సమంజసం కాదని అలాగే జగన్ ఇస్తున్న హామీలు నెరవేర్చాలంటే రాష్ట్ర బడ్జెట్ కాదు కదా అమెరికా బడ్జెట్ కూడా సరిపోదని ఎద్దేవా చేశారు. ఇక కాపు జేఏసీ నేతలు , వైఎస్ఆర్సిపి లో ఉన్న బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని, అంబటి రాంబాబు వంటివారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని విరుచుకుపడుతున్నారు.
ఈ పరిణామాల మధ్య లో, కాపులని మోసం చేయవద్దు అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని జగన్ పాదయాత్ర వద్దకు వందలాదిగా కాపు ఆందోళనకారులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జగన్కు వ్యతిరేకంగా ఉన్న ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శిస్తూ, జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ , కాపులని మోసం చేయవద్దు అంటూ నినాదాలు చేయడంతో పాదయాత్రలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఏది ఏమైనా జగన్ గోదావరి యాత్రలో కాపు రిజర్వేషన్ల అంశంపై ఈ విధంగా మాట్లాడి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే కనిపిస్తోంది.