వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిని అనే సంగతిని మర్చిపోయి చౌకబారు విమర్శలను అధికార వేదికల మీద నుంచి చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. తాజాగా ఆయన నేతన్న హస్తం పేరుతో బటన్ నొక్కడానికి వెంకటగిరి వెళ్లి … వాలంటీర్ల సాయంతో తరలించుకు వచ్చిన జనం ముందు చెలరేగిపోయారు. పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంచి చేస్తున్న వారిని సంస్కారం ఉన్న ఎవరు అవమానించరని చెప్పుకొచ్చారు. మంచి చేస్తున్న వాలంటీర్లను గురించి సంస్కారం కోల్పోయి కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాలంటీర్లును మనవళ్ళు, మనవరాళ్లుతో పోల్చుకున్నారు సీఎం జగన్.
తప్పుడు మాటలకి స్క్రిప్ట్ రామోజీ రాసిస్తే.. చంద్రబాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారని జగన్ అన్నారు. దానికి దత్తపుత్రుడు నటిస్తున్నారని మండిపడ్డారు. మహిళల అక్రమ రవాణా అంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. అన్యాయంగా బురద జల్లుతున్నారని చెప్పుకచ్చారు. పదేళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్‌గా పనిచేస్తున్న వ్యక్తే మన వాలంటీర్లు క్యారక్టర్‌ను తప్పు పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు వాలంటీర్‌గా పని చేస్తున్న వ్యక్తి వాలంటీర్ వ్యవస్థను తప్పుబడుతూ వాళ్ల క్యారెక్టర్‌పై నిందలు వేస్తున్నారని ఆరోపించారు.
జగన్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరినట్లుగా ఆయన మాటల తీరు మారిపోయింది. చంద్రబాబు, లోకేష్‌లపైనా మాట్రారు. ఒకరు నాలుగేళ్లకోసారి అమ్మాయిలను లోబర్చుకొని కాపురం చేసి వదిలేస్తారని పవన్ ఉద్దేశించి మాట్లాడారు జగన్. ఇంకొకరు స్విమ్మింగ్ పూల్‌లో అమ్మాయిలతో దొరికిపోతారని లోకేష్ గురించి మాట్లాడారు. మరొకరు అమ్మాయిక కనిపిస్తే కడుపు చేయాలని అంటారని బాలకృష్ణ గురించి ప్రస్తావించారు జగన్. ఇలాంటి వారి మాటలు నమ్మొద్దని వేడుకున్నారు.
జగన్ మాటల తీరు చూసి సభకు వచ్చిన వాళ్లు.. టీవీల్లో చూసిన వారు కూడా…సీఎం పొజిషన్ లో ఉన్న వ్యక్తేనా అని ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. ఓ వైపు తమను వ్యతిరేకించిన వారి కుటుంబాల్లో ఆడవాళ్లపై అత్యంత దారుణమైన ప్రచారాలు జగన్ రెడ్డి గ్యాంగ్ చేస్తూ ఉంటుంది. మరో వైపు ఆయన వేదికలపై ఇలా మాట్లాడుతూండటం.. ప్రజల్ని నివ్వెర పరుస్తోంది.