ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజుల పేరుతో వసూలు చేసిన మొత్తంలో రూ. నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఇండియా టుడే చానల్‌కు ధారబోసింది జగన్ రెడ్డి సర్కార్. గత డిసెంబర్ లో ఇండియాటుడే ఎడ్యుకేషన్ కాంక్లేవ్ ను తిరుపతిలో నిర్వహించాలనుకుంది. అక్కడ పెట్టడానికి కారణం రూ. నాలుగు కోట్ల 20 లక్షలు ఏపీ సర్కార్ ఆఫర్ చేయడమే. అయితే అప్పట్లో నిర్వహిస్తే ఎన్నికల సమయానికి అంతా మర్చిపోతారని.. జనవరి నెలాఖరుకు మార్చారు. ఇప్పుడు ఆ కాంక్లేవ్ తిరుపతిలో నిర్వహిస్తున్నారు.
జాతీయ మీడియాలో సర్వేలు ఇతర వార్తలు తనకు వ్యతిరేకంగా.. తన పార్టీకి వ్యతిరేకంగా రాకుండా ఉండటం కోసం జగన్ రెడ్డి ప్రతి ప్రముఖ చానల్‌కు కోట్లు కట్టబెడుతూ వస్తున్నారు. టైమ్స్ నౌ సహా అనేక సంస్థలకు ఇలా డబ్బులు చెల్లించారు. ఇండియా టుడేకూ చెల్లిస్తున్నారు. ఈ నిధులు విడుదల చేస్తూ ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన కూడా ప్యానెల్ డిస్కషన్ లో పాల్గొని డబ్బా కొట్టనున్నారు
నాలుగు ప్యానల్ డిస్కషన్లను బుక్ చేసుకోవడానికి నాలుగు కోట్ల ఇరవై లక్షలు వెచ్చిస్తున్నారు. ఈ ప్యానల్ డిస్కషన్లతో ఏమి వస్తుంది.. అసలు అంత అవసరం ఏమిటి… అంటే.. ఏమీ రాదు. జగన్ రెడ్డికి అనుకూలంగా సర్వేలు వేయడానికి అడ్డగోలుగా అక్రమ మార్గంలో చేసే చెల్లింపులు ఇవని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనికి కూడా జగన్ రెడ్డి ప్రజల డబ్బులే వాడుతూండటం విషాదం. ఇప్పటికే టైమ్స్ నౌ, ఎన్డీటీవీలకు ఇమేజ్ బిల్డింగ్ పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చారు. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో కీలక కాంట్రాక్ట్ ను టైమ్స్ నౌ గ్రూపునకు ఇచ్చారు. ప్రతి వాళ్లు.. తాడేపల్లి ప్యాలెస్ లో తయారయ్యే ఈటీజీ సర్వేలను నెలకోసారి ప్రసారం చేస్తూంటారు. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టడే ప్రకటించే సర్వేల్లో.. జగన్ రెడ్డికి మంచి ఫలితాలు రావడంలేదు. అందుకే ఈ సారి మరింత ప్రజాధనం పెట్టి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.