జగన్ రెడ్డి పూర్తిగా చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోంది. ప్రతిపక్షాలకు అధికారం అవకాశం ఇస్తే తనను మట్టుబెడతానంటున్నారు అని.. ఏడుపుగొంతుతో ప్రజల ముందుకు వచ్చేశారు. అమలాపురంలో డబ్బుల్లేని బటన్ నొక్కేందుకు రూ. కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఈ ఏడుపుల్ని జగన్ రెడ్డి ప్రారంభించారు. నిన్న ముగ్గురు ఒక్కో చోట సభలు నిర్వహించారని.. అధికారం ఇస్తే ఎవరినీ వదలరని హెచ్చరించారని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే తన అంతు చూస్తారని బెదిరించారన్నారు. ఏకంగా నరకాన్ని చూపిస్తామంటున్నరని టోన్ మార్చి వేరియేషన్ చూపించి మరీ ప్రసంగించారు. గిట్టని వారిని మట్టు బెడతామంటున్నారని.. ్ందుకే అధికారం ఇవ్వాలంటున్నారని ఆరోపించారు. ఇవన్నీ తాను అన్న మాటలు కాదని.. చంద్రబాబు దత్తపుత్రుడు, సొంత పుత్రుడు అన్నమాటలని చెప్పుకొచ్చారు.
జగన్ రెడ్డి మాటలు విన్న వారికి ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఆయనలో భయం ప్రారంభమయిందని.. తాను ప్రతిపక్షాలను చేసిన వేధింపులకు అధికారం కోల్పోతే.. తనకు నిలువ నీడ కూడా ఉండదన్న భయానికి ఆయన వస్తున్నారని భావిస్తున్నారు. ఇదేఏ ఏడుపును ముందు ముందు మరింత ఎక్కువగా ప్రజల ముందు వినిపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సారి ఓడిపోతే తనను చంపేస్తారని.. దయచేసి గెలిపించని ఆయన సెంటిమెంట్ ప్రయోగించే ప్లాన్ ఐ ప్యాక్ రెడీ చేసిందని అంటున్నారు.
ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ నేతల్ని నడి రోడ్డుపై పీకలు కోసిన ఘటనలు.. చంద్రబాబు సహా ఎవర్నీ వదలకుండా కుటుంబాలను సైతం టార్గెట్ చేసి చిరునవ్వులు చిందించుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు అదికారం పోతుందనే భయంతో.. ప్రజల్ని వేడుకునే పరిస్థితి వచ్చారన్న సెటైర్లు వస్తున్నాయి. మొత్తంగా జగన్ రెడ్డి తన పాలనపై పూర్తిగా నమ్మకం కోల్పోయారని.. చేసిన తప్పులకు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయంతో.. ప్రజల ముందుకు ఏడుపు మొహంతో వచ్చేందుకు మొదటి అడుగు అమలాపురంలో వేశారని వైసీపీ వర్గాలు కూడా ఓ నమ్మకానికి వచ్చాయియ
అయితే జగన్ రెడ్డే ఇలా డీలా పడిపోతే.. మిగిలిన వారి పరిస్థితి ఏమిటన్నది కింది స్థాయి నేతలకూ అర్థం కాకుండా ఉంది. అధికారం ఉందని రెచ్చిపోయిన వారు.. ఇప్పుడు జగన్ రెడ్డి మాటలతో.. తమ పరిస్థితి ఏమిటా అని ఆందోళనపడిపోయే పరిస్తితి వస్తోంది.