వాడుకున్న తర్వాత అడ్డగోలుగా వదిలేయడం కోసం… అప్పటి వరకూ ఉపయోగపడిన వారిపై తప్పుడు కేసులు.. వ్యక్తిత్వాలపై బురద చల్లడం వైసీపీలో కామన్. అది వారి వ్యూహం. నాటి మైసూరారెడ్డి నుంచి నేటి హిందూపురం మున్సిపల్ చైర్మన్ వరకూ అదే ప్లాన్. ఇప్పుడు తమ స్ట్రాటజిస్టుగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ పైనా అదే వ్యూహం అమలు చేస్తున్నారు. పీకేని .. వదిలించుకుందామనుకుంటున్న జగన్ రెడ్డి బ్యాక్ ఆ సంస్థపై తప్పుడు ఆరోపణలతో … ఆస్థాన జర్నలిస్టులతో కథలు రాయించడం ప్రారంభించారు.
కర్రి శ్రీరాంరెడ్డి అని డెక్కన్ క్రానికల్ ఓ వైసీపీ జర్నలిస్టు ఉంటారు. ఆయన డీసీలో సరిగ్గా జీతాలివ్వడం లేదనో మరో కారణమో కానీ.. సజ్జల పే రోల్ లో ఉంటూ ఇతర సంస్థల్లో ఆయన సూచనలకు అనుగుణంగా కథనాలు రాయడంతో సిద్ధహస్తుడనే పేరుంది. ఆయన ఐ ప్యాక్ టీడీపీకి పని చేయబోతోందనే కథనాన్ని వండి వార్చారు. ఇందు కోసం మమతాబెనర్జీ మాట్లాడుతుందని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు… పీకే వచ్చి ఏం చేస్తాడు.. అంతగా సాయం చేయదల్చుకుంటే… టీడీపీ ఓడిపోయినప్పుడే… ఐదేళ్ల కోసం పని చేయమని అడిగేవారు కాదా ?. ఆయన రాసిన కథనంలో చాలా తేడాలున్నాయి.
కనీస జర్నలిస్టుకైనా ఇదేం లాజిక్ అనిపించేలా రాసుకొచ్చాడు. చంద్రబాబు ఇండియా కూటమిలో చేరాలని.. ఐ ప్యాక్ ను దీదీ మాట్లాడుతున్నారట… అంతే నా… చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇలా పిచ్చకుంట్ల రాతలతో శ్రీరామ్ రెడ్డి తన కథనాన్ని వడ్డి వారించారు. అయితే ఈ కథనం మొత్తం… ఐ ప్యాక్ పై నిందలతోనే ఉంది. ఆ సంస్థ సర్వేలు చేస్తూ.. టీడీపీకి లీక్ చేస్తోందని సోషల్ మీడియాలో జరుగుతున్నప్రచారానికి అనుగుణంగా అనుమానాలు రేకెత్తించేలా ఉంది. అసలు పీకే సంస్థకి క్యారెక్టర్ లేదని నింద వేశారు.
ఐ ప్యాక్ ను వదిలించుకోవడానికి సజ్జల , జగన్ రెడ్డి కలిసి ఆడుతున్న స్కెచ్ గా కొంత మంది అనుమానిస్తున్నారు. ఎందుకంటే టీడీపీ ఇప్పుడు పక్కా స్ట్రాటజీలతో… కదనరంగంలో ఉంది . గతంలో ఐ ప్యాక్ లో పని చేసిన రాబిన్ శర్మ పెట్టుకున్న ఓ కన్సల్టింగ్ సంస్థ టీడీపీకి పని చేస్తోంది. ఈ సంస్థ స్ట్రాటజీలు ఎలా వర్కవుట్ అవుతున్నాయో.. టీడీపీకి తెలుసు. అదే సమయంలో ఐ ప్యాక్ వ్యూహాలు తేలిపోతున్నాయి. దీంతో ఐ ప్యాక్ ను వదిలించుకునేందుకు సిద్ధమవతుున్నారని అందుకే నిందలేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.