పోలవరంలో అవినీతి పేరుతో.. కేంద్రంపైనే జగన్మోహన్ రెడ్డి గురి పెట్టారనే చర్చ ఢిల్లీలో జరుగుతోంది. తనపై ఉన్న కేసులను బూచిగా చూపి కేంద్రం.. ఏపీని పట్టించుకోకపోయినా మాట్లాడలేని పరిస్థితులు కల్పించడంతో.. కేంద్రాన్ని ఎలాగోలా బుక్ చేయాలన్న ఉద్దేశంతోనే.. జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రచ్చ చేస్తున్నారని.. ఢిల్లీ అధికారవర్గాలు నమ్ముతున్నాయి. 151 సీట్లతో ముఖ్యమంత్రి పదవి చేపట్టినా… తన ఆలోచనలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నానని… కేంద్రాన్ని ఎలా కట్టడి చేయాలన్న అంశంపైనే.. ఆత్మీయులతో జగన్ చర్చలు జరుపుతున్నారని ఇప్పటికే ఉద్ధృతంగా ప్రచారం జరుగుతోంది. పోలవరంలో అవినీతి అంటూ… రచ్చ చేస్తే.. అది అంటుకునేది కేంద్రానికేనని క్లారిటీ రావడంతోనే దూకుడు పెంచుతున్నారని అంటున్నారు.
పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగితే ఎవరిది బాధ్యత..!?
పోలవరం జాతీయ ప్రాజెక్ట్. నిర్మాణ నిర్వహణ మాత్రమే… ఏపీ సర్కార్ ది. ఏ నిర్ణయం అయినా… కేంద్ర ప్రభుత్వం .. నియమించిన పోలవరం ప్రాజెక్ట్ ఆధారిటీ ద్వారానే తీసుకోవాలి. జలశక్తి మంత్రి అంతిమ నిర్ణయం తీసుకోవాలి. పీపీఏ అనుమతి లేకుండా.. టెండర్లు పిలిచే అధికారం కూడా ఏపీ సర్కార్ కు లేదు. అయినప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి మొత్తం అవినీతిని బయట పెట్టడానికి రేమండ్ పీటర్ అనే రిటైర్డ్ అధికారి నేతృత్వంలో ఓ కమిటీ వేశారు. దానికి నిపుణుల కమిటీ అని పేరు పెట్టారు. ఆ కమిటీ.. ఎన్ని పరిశీలించిందో .. ఏమి పరిశీలించిందో కానీ.. రూ. 3వేల కోట్ల వరకూ అవినీతి జరిగిందని నివేదిక ఇచ్చింది. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కావడంతో… ఆ అవినీతి.. కేంద్రానికి,పోలవరం ప్రాజెక్ట్ అధారిటీకి చుట్టినట్లయింది. ఆ నివేదికను తీసుకెళ్లి ప్రధానమంత్రికే ఇచ్చారు. ప్రధాని నమ్మేస్తారని.. అనుకున్నారు. కానీ.. ప్రధాని దాన్ని.. పీపీఏ, జలశక్తి మంత్రికి పంపి వివరణ అడగడంతో.. జగన్ స్కెచ్ గురించి… కేంద్రాని లైట్ వెలిగింది. పోలవరం ప్రాజెక్ట్ తమ చేతుల్లో నిర్మితమవుతున్న ప్రాజెక్ట్. దీనిలో అవినీతి అంటే.. నేరుగా తమపైనే బురద వేయడం అని వారికి క్లారిటీ వచ్చేసింది. అందుకే.. శరవేగంగా రియాక్ట్ అయ్యారు.
సందు ఇచ్చి ఉంటే ఈ పాటికి కేంద్రమంత్రులపై అవినీతి కేసులు..!
రేమండ్ పీటర్ కమిటీ నివేదికలో ప్రస్తావించిన ప్రతీ విషయాన్ని ఆధారాలు కావాలని అడగడంతో.. ఏపీ సర్కార్ నోట్ల పచ్చి వెలక్కాయ పడినట్లయింది. చివరికి.. ఆ నిపుణుల కమిటీ నివేదికతో తాము ఏకీభవించడం లేదని.. పోలవరంలో తప్పులేమీ లేవని… సవివరణంగా …రివర్స్ నివేదికను సమర్పించాల్సి వచ్చింది. అవినీతి జరిగిందని.. ప్రధానమంత్రికి సమర్పించిన నివేదిక లోగుట్టును.. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగానే గుర్తించడంతో.. వెంటనే… రివర్స్ నివేదిక తీసుకుంది. చచ్చినట్లుగా.. పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి లేదని.. నివేదిక పంపాల్సి వచ్చింది. జగన్ ఇచ్చిన నివేదిక విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం ఏ మాత్రం సాఫ్ట్ గా ఉన్నా… ఏపీ సర్కార్ కేసులు నమోదు చేసి ఉండేది. అందలో మొదటగా బాధ్యులు… పీపీఏ అధికారులు, సంబంధిత కేంద్రమంత్రి వస్తారు. ఈ విషయం గుర్తించడంతో… కేంద్రం తీవ్ర ఆగ్రహంతో ఉందంటున్నారు.
అయినా కేంద్రాన్ని ఇరికించడానికి జగన్ “రివర్స్” ప్రయత్నాలు..!?
పోలవరంలో ఎలాంటి అవినీతి లేదని చెప్పినా… కేంద్రం చేతుల్లో ఉన్న జాతీయ ప్రాజెక్టుకు సొంతంగా రివర్స్ టెండర్లు పిలిచేసింది ఏపీ సర్కార్. పీపీఏ అనుమతి లేదు. కోర్టు స్టే ఉంది. అయినప్పిటకీ.. టెండర్లు ఖరారు చేసేశామని.. 8వందల కోట్లు ఆదా చేశామని గంభీరమైన ప్రకటనలు చేస్తోంది. అంటే.. అంతకు తగ్గ అవినీతి జరిగిందని.. ప్రచారం చేయడమే. ఇది పైకి టీడీపీ అని చెబుతున్నా.. అసలు నేరుగా తగిలేది కేంద్రానికే. రివర్స్ పై ఇంకా కోర్టు నిర్ణయం తీసుకోవాల్సిఉంది. ఆ తర్వాత కేంద్రం దృష్టి పెట్టనుంది. ఇప్పటికి.. 8 కోట్లు ఆదా చేశామని లేకపోతే.. అవి టీడీపీ జేబులోకి పోయేవని చెబుతున్న ఏపీ సర్కార్.. దీనిపై కేంద్రం దృష్టి పెట్టిన తర్వాత లోగుట్టంతా బయట పడే చాన్సులే ఎక్కువ ఉన్నాయి.