జగన్ రెడ్డి ప్రతి ప్రచార సభలోనూ తనకు పేపర్లు, టీవీలు లేవని బుకాయిస్తూ ఉంటారు. అందరికీ తెలిసిన విషయాన్ని అడ్డగోలుగా ఎందుకు ఆయన అబద్దం చెబుతారో చాలా మందికి అర్థం కాదు. చివరికి సాక్షి జర్నలిస్టులకూ అర్థం కాదు. తనను నమ్మే గొర్రెలు ఉంటాయని.. తాను ఏది చెబితే అది నమ్ముతాయని జగన్ రెడ్డి ఉద్దేశమని చాలా మంది అనుకుంటారు. అది ఓ రకంగా నిడమే కావొచ్చు కానీ అసలు అంత అబద్దం చెప్పాల్సిన అవసరం ఏమిటి.. పేపర్లు, టీవీ ఉన్నందున ప్రజలు ఓట్లేయకుండా పోరు. మరి ఎందుకుఆ అబద్దాలు అంటే… ఇక్కడే ఎవరికీ తెలియని అసలు ట్విస్ట్ ఉంది.
సాక్షి తో పాటు ఆస్తులన్నింటిలోనూ సగం వాటా ఉందని .. తనకు తండ్రి ఇచ్చారని షర్మిల వాదిస్తున్నారు. ఇప్పటి వరకూ బయటకు తెలియకపోయినా…. రెండు రోజుల క్రితం సాక్షిలో తనకు సగం వాటా ఉందని చేసిన ప్రకటనతో ఈ అంశంపై స్పష్టత వచ్చింది. సాక్షి మీడియాలో తనకు సగం వాటా ఉందని.. వైఎస్ఆర్ రాసిచ్చారని ఆమె చెప్పారు. ఈ ఆస్తుల గొడవ చాలా కాలంగా జరుగుతోంది. ఈ ఆస్తుల గొడవ వచ్చినప్పటి నుంచే జగన్ రెడ్డి తనకు పేపర్లు, టీవీలు లేవని చెబుతూ వస్తున్నారు. అంటే ప్రజలకు చెప్పుకోవడానికి కాదని.. అవన్నీ తనవి కాదని భ్రమింపచేయడానికని సులువుగానే అర్థమైపోతుంది.
జగన్ రెడ్డి అన్నీ బినామీ ఆస్తులు. దొంగ కంపెనీలు..సూట్ కేసు కంపెనీల పేరు మీద ఉంటాయి. అందుకే షర్మిల లీగల్ ఫైట్ చేయలేకపోతున్నారు. బినామీలు.. తప్పుడు కంపెనీల్లో షేర్లు అన్నీ జగన్ రెడ్డి కనుసన్నల్లో ఉంటాయి. వీటిని తాను అందరికీ ఎగ్గొట్టి తాను మాత్రమే ఉంచుకోవడానికి జగన్ రెడ్డి చెల్లిని మోసం చేస్తున్నారు. లీగల్ గా ఆ ఆస్తులన్నీ పంచుకునే అవకాశం లేకపోవడంతో తనకేమీ లేవని చెబుతున్నారు. షర్మిలను తెలివిగా మోసం చేస్తున్నానని అనుకుంటున్నారు. కానీ షర్మిల అంతకు మించి తెలివిగా రాజకీయంగా జగన్ రెడ్డి కుర్చీ లాగేస్తున్నారు.