రాజకీయాల్లో డ్రామాలు చేయడం, స్క్రిప్టులు రాసుకుని దాని ప్రకారం రియల్ గా స్కిట్స్ ప్లే చేయడం పాత రోజుల్లో ఉండేదో లేదో కానీ జగన్ రాజకీయంలో మాత్రం కామన్. ఆయన రోడ్డు మీదకు వెళ్తే ఎప్పుడు ఏం చేయాలో.. కార్యకర్తలు ఎలావ్యవహరించాలో.. ఎవరెవరి కాంబినేషన్లు ఆయనను పలకరించారో ఇంకాచెప్పాలంటే.. రెండువర్గాలు ఏం మాట్లాడాలో కూడా ముందే డిసైడ్ చేస్తారు. ఇదో రకం డ్రామా రాజకీయం. తిరుపతిలోనూ అదే చేశారు. ఆ డ్రామాలను చూసి జనం కూడా ఆశ్చర్యపోయారు. అదే బావిలోఎంత కాలం ఉంటారని కాస్త రియాల్టీలోకి రావాలని సలహాలిస్తున్నారు.
తిరుపతికి వచ్చినప్పటి నుండి జేజేలు కొట్టేందుకు చెవిరెడ్డి రెండు వందల మందిని తెచ్చారు. వారే ఆయన ఎక్కడ ఆగినా సెల్ఫీలు తీసుకుంటూ ట్రాఫిక్కు అడ్డం పెడుతూ హడావుడి చేస్తారు. జై జగన్ నినాదాలు చేస్తారు. జగన్ రెడ్డి కామన్ సెన్స్ లేకుండా ఆస్పత్రిలోకి వందల మందితో వెళ్తారు. అక్కడ ఓ డ్రామా. తనకేదో తెలిసినట్లుగా.. అక్కడేదో జరిగిపోయిందన్నట్లుగా జూనియర్ ఆర్టిస్టులాగా వాళ్లను వీళ్లనూ అడుగుతూ…పెద్ద బిల్డప్ ఇచ్చే ఫేస్ పెట్టడం. ఇదంతా ఆయనకు గొప్ప పర్ఫార్మెన్స్ అనిపిస్తుందేమో కానీ చూసే వారికి చాలా వెగటుగా ఉంటుంది.
ఇప్పుడు రాజకీయాలు ఎంతో మారిపోయాయి. అన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నాయి. నువ్ డ్రామాలాడుతున్నావా.. రాజకీయంచేస్తున్నావా అన్నది అందరికీ తెలిసిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి… రాజకీయంలో నిజాయితీ ఉండాలి. ఇష్టం వచ్చినట్లుగా అందరికీ అబద్దాలు చెప్పి అదే నమ్మేస్తారంటే ఎలా ?. తొక్కిసాలట ఘటన జరిగిన రోజు చంద్రబాబు విశాఖ నుంచి వచ్చారు.ఆయన పర్యటకు పోలీసుల్ని పంపారని అంటారు. అంతకు ముందు కుప్పం పర్యటన పూర్తయింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కుప్పం వెళ్తే రెండున్నర వేల మంది పోలీసుల్ని తరలించారు. చంద్రబాబు పర్యటనలో సగం మందిని కూడా పెట్టలేదు.
డ్రామాలు, అబద్దాలతోనే బండి నడిపించుకోవచ్చని జగన్ అనుకుంటున్నారు. కానీ ఆయనకు తెలుసో లేదో గానీ రాజకీయం చాలా ముందుకెళ్లింది.అందుకోవాలంటే ఆయన చాలా మారాలి.