రాజకీయం అంటే గుడ్డిగా నమ్మేవాళ్లకు తమకు ఏది అవసరమో అది చెప్పి నమ్మించి ముందుకెళ్లడం కాదు. తమను నమ్మని వాళ్లకు కూడా నిజాలు చెప్పి నమ్మించాలి. కానీ ఫేక్ చెప్పి వాళ్లనూ నమ్మించాలంటే ఎలా సాధ్యమవుతుంది ? సింపుల్ లాజిక్ ను వైసీపీ మిస్సవుతోంది. ఫలితంగా రోజు రోజుకు కుంచించుకుతోంద. హిందూత్వం విషయంలో నిండా మునిగిన జగన్ .. చివరి క్షణంలో పరారీ కావడంతో వైసీపీ క్యాడర్ మానసిక స్థైర్యం పడిపోయింది.
తిరుమల పర్యటనకు అనుమతి ఇవ్వలేదా ?
జగన్ తిరుమల పర్యటనకు అనుమతి ఇవ్వలేదని అందుకే జగన్ ఇంట్లో నుంచి బయటకు రాలేదని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అందుకు సాక్ష్యం అంటూ.. ఓ వైసీపీ కార్యకర్తకు ఇచ్చిన నోటీసుల్ని చూపిస్తున్నారు. ఆ వైసీపీ కార్యకర్తకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున జగన్ తోపాటు ర్యాలీలు లాంటివి చేయడం నిషేధమని నోటీసులు ఇచ్చారు. అది జగన్ తనకు ఇచ్చినట్లుగా చెప్పుకునేందుకు ఈ మాత్రం సిగ్గుపడటం లేదు. తాము ఏమి చెప్పినా నమ్ముతారనే హలోకేషన్లో ఉండి రాజకీయాలు చేయడం వల్లే ఈ సమస్యలు.
అడ్డుకున్నా వెళ్లడం కదా రాజకీయ నాయకుడి లక్షణం !
చంద్రబాబు ఓడిపోయిన నెల రోజుల్లోనే పల్నాడు వెళ్లాలనుకున్నారు. ఆయన వెళ్లకుండా ఇంటి గేట్లను తాళ్లతో కట్టేశారు. తర్వాత వైజాగ్ వెళ్లాలనుకున్నారు. ఎయిర్ పోర్టులో వైసీపీ కార్యకర్తల్నిపంపి గంటల తరబడి ఆపేశారు. తిరుపతిలోనూ అంతే. చంద్రబాబును ప్రతిపక్ష నేతగా ఎక్కడికి వెళ్లనీయలేదు. ఆయన పోలీసులు అడ్డుకునేవరకూ ప్రయత్నాలు చేశారు. కానీ జగన్ ఏం చేశారు ?. ఇంట్లో నుంచి బయటకు రాలేదు. తిరుమలకు వెళ్లేందుకు పూర్తి భద్రతతో ఏర్పాట్లు కూడాచేశారు. అది అందికీ తెలుసు. అడ్డుకున్నారని చెబితే ఎవరు నమ్ముతారు ?
క్యాడర్ స్థైర్యాన్ని దెబ్బకొట్టిన జగన్
ముందుండి నడిపించేవాడే నాయకుడు. అయితే జగన్ ఈ విషయంలో అందర్నీ ముందుకు తీసి..ఆయన వెనుక ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘోరమైన పాలనతో నమ్ముకున్న వారందర్నీ నట్టేట ముంచడంతో వారు జైళ్లకుపోతున్నారు. ఇప్పుడు కార్యకర్తల్ని బలి చేయాలనుకుంటున్నారు కానీ తాను మాత్రం బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో క్యాడర్ తాము మాత్రం ఎందుకు రోడ్డెక్కాలని సైలెట్ అవుతున్నారు