జగన్ రెడ్డికి ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత తొలి ఐదేళ్ల పాలనలో టీడీపీ సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెట్టించినా ప్రతీ వర్గానికి సంతృప్తి కరంగా డిమాండ్లు తీర్చినా కడుపు నిండిన వారికి కులమే పెద్ద సమస్య అన్నట్లుగా కుల చిచ్చు పెట్టి తనకు కావాల్సినంత మెజార్టీ తెచ్చుకున్నారు జగన్ రెడ్డి. మరి ఈ ఐదేళ్లలో ఐయన ఏం చేశారు..?., ఏమీ చేయలేదు. కానీ ఏం చేశారని అందరూ అడుగుతున్నారని.. అలా అడగడమే పద్మవ్యూహం అన్నట్లుగా తాను అభిమన్యుడ్ని కాదు.. అర్జునుడినని.. సినిమా డైలాగులు చెప్పుకుంటూ తెరపైకి వస్తున్నారు. జగన్ రెడ్డి అర్జునుడా.. అభిమన్యుడా లేకపోతే బృహన్నలనా అన్నది తర్వాత ముందు ప్రజాస్వామ్య బద్దంగా తన పాలనపై సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. అది అధికారంలో ఉన్న నేత లక్షణం. అలా కాకుండా ప్రశ్నించడమే తప్పన్నట్లుగా ఏడ్చుకుంటూ ప్రజల వద్దకు పోవడాన్ని ఏమనాలి ?
చెల్లి కూడా పాలననే ప్రశ్నిస్తోంది జగన్ రెడ్డి !
చెల్లి షర్మిల వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు. సోషల్ మీడియాలో ఆమెను.. ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె భ ర్తను కించ పరుస్తూ.. దాడి చేయిస్తున్నా… బాధపడుతున్నారు కానీ.. జగన్ రెడ్డిపైన కానీ.. ఆయన భార్యపైన కానీ ఒక్క మాట కూడా షర్మిల మాట్లాడటం లేదు. తనకు అన్యాయం చేశారని మాత్రం చెబుతున్నారు.. కానీ తన రాజకీయ పయనానికి ఆ ఆన్యాయం కారణం కాదని.. ప్రజల్ని మోసం చేశారని.. చెప్పిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేకహోదా దగ్గర నుంచి మద్య పాన నిషేధం వరకూ. .. అన్ని అంశాలపై ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పకుండా.. బాణాలకు బలైపోవడానికి అభిమన్యుడ్ని కాదంటూ… ప్రకటనలు చేయడం చేతకాని తనానికి నిదర్శనం కాదా ?
చేతకాని తనాన్నే ప్రశ్నిస్తున్న విపక్షాలు – సమాధానం చెప్పుకోలేరా ?
విపక్షాలు జగన్ రెడ్డి చేతకాని తనాన్నే ప్రశ్నిస్తున్నాయి. ఐదేళ్లలో పది లక్షల కోట్ల అప్పు చేసి చేసిందేమిటని అడుగుతున్నాయి.. పోలవరం ఎందుకు కట్టలేకపోయారని అంటున్నారు. మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు ఎందుకు వృధా చేశారని అడుగుతున్నారు. బటన్ నొక్కుడుపేరుతో బడుగుల్ని ఎందుకు మోసం చేశారని ప్రశ్నిస్తున్నారు. సెంట్ భూమి పేరుతో ఎందుకు పేదల్ని రోడ్డున పడేశారని అడుగుతున్నారు. మద్యం ధరలు పెంచి.. చీప్ లిక్కర్ సొంత బ్రాండ్లు అమ్మి ప్రజల్ని ఎందుకు చావగొట్టావని అడుగుతున్నారు. ఇలా అడగడం.. ప్రతిపక్షాల పని కానీ.. వారు అలా అడుగుతున్నారంటూ ఏడుస్తూ ప్రజల ముందుకు పోవడం.. చేతకాని తనానికి నిలువెత్తు సాక్ష్యం.
ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు జగన్ రెడ్డి – పరదాల మధ్య తెలియడం లేదంతే ?
చెల్లి.. ప్రతిపక్ష పార్టీలే కాదు.. సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మద్యం దుకాణాల దగ్గర ఒక్క సారి మారువేషంలో నిలబడితే..లేదా నీ మనిషిని నిలబెట్టి… బాడీ ఓర్న్ కెమెరాలతో తెలియకుండా మాట్లాడిస్తే.. .. నిన్ను ప్రశ్నించే ఘాటు భాష ఏ స్థాయికి వెళ్లిందో తెలుస్తుంది. రోజు కూలీల్ని కూడా వదలకుండా అప్పుల పాలు చేసిన నీ పాలన నిర్వాకం ప్రతి పేదవాడి ఇంటిలోనూ కనిపిస్తుంది. అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలు .. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నించడమే తప్పన్నట్లుగా చెప్పుకోవడం సీఎం జగన్ రెడ్డి మానసిక డొల్లతనానికి సాక్ష్యంగా కనిపిస్తోంది. ఈ స్థితి నుంచి జగన్ రెడ్డి బయటపడటానికి ప్రజలు బటన్లు నొక్కడం ద్వారా.. చికిత్స చేయడానికి రెడీగా ఉన్నారు.