జగన్ రెడ్డి చేసిన చిల్లర రాజకీయాలకు వైసీపీ క్యాడర్ అంతాకేసుల పాలవుతోంది. జగన్ రెడ్డి సోషల్ మీడియా కేసులతోనే చాలా మందిని జైలుకు పంపుతున్నారు. ఇప్పుడు ఆయన రాళ్లు వేయించడం, దాడులు చేయించడం లాంటి పనికి మాలిన రాజకీయాలకు
మరికొంతమంది కేసుల పాలవుతున్నారు. నందిగామలో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి కేసులో వైసీపీ ప్రధాన క్యాడర్ అరెస్టు అయింది. మాజీ ఎమ్మెల్యే సోదరుల్ని కూడా అరెస్ట్ చేయబోతున్నారు. రాళ్ల దాడి వెనుక ఉన్న భారీ కుట్రను చేధించబోతున్నారు.
ఇలా పలు చోట్ల రాళ్ల దాడులు జరిగాయి. మార్కాపురంలో ఓ వృద్ధుడుకూడా చనిపోయాడు. అన్ని చోట్లా అప్పుడు అసలు కేసులు పెట్టకపోవడమో.. పైపైన కేసులు పెట్టడమో జరిగింది. ఇప్పుడు అవి మొత్తం బయటకు తీసి అందర్నీ జైలుకు పంపుతున్నారు. దీంతో జగన్ రెడ్డిని దమ్ముని అడ్డగోలు వ్యవహారాలు చేసిన వారంతా పారిపోవాల్సి వస్తోంది. లేకపోతే జైలుకు వెళ్తున్నారు.
అధికారంలో ఉన్న జగన్ రెడ్డి డైరక్ట్ రాజకీయాలు చేయలేదు. చిల్లర రాజకీయాలు చేశారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా అడ్డుకోవడం దగ్గర నుంచి రాళ్లు వేయించి.. టీడీపీ వాళ్లే కోపంతో వేశారని చెప్పడం వరకూ చేయని పిచ్చి రాజకీయం లేదు. ఇందులో అంతా వైసపీ క్యాడరే ఉంది. టీడీపీ ఆఫీసుపై దాడి దగ్గర నుంచి చంద్రబాబు నివాసంపై దాడి వరకూ కొన్ని వందల మంది కేసుల పాలవుతున్నారు. ఇవన్నీ వైసీపీ హయాంలో జగన్ రెడ్డిని చూసుకుని ఆయనను మెప్పించడానికి చేసిన దాడులు..ఘోరాలే. ఈ పాపం అంతా జగన్ రెడ్డిదే.