బీజేపీని మోసం చేయాలంటే చాలా తెలివితేటలు ఉండాలి. అవి జగన్ లో పుష్కలంగా ఉన్నాయని తేలిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఆప్తమిత్రుడు స్టాలిన్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి వెళ్లలేదు. కానీ అదే సమయంలో డిలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం చేయవద్దని మోదీకి ఓ లేఖ రాసినట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. ఆ లేఖను స్టాలిన్ కు పంపారు. అంటే అటు సమావేశానికి హాజరు కాకుండా బీజేపీని.. ఇటు కాంగ్రెస్ కూటమిని కూడా సంతృప్తి పరచాలని జగన్ అనుకున్నారు .
మోదీకి లేఖ రాయడం ఎందుకు ?
స్టాలిన్ నేతృత్వంలో జరిగిన సమావేశం పూర్తిగా రాజకీయం. ఎందుకంటే ఇంత వరకూ డీ లిమిటేషన్ విధివిధానాలు ఖరారు కాలేదు. జనాభా లెక్కల ద్వారానే .. వాటినే ప్రామాణికంగా తీసుకుని చేస్తామని ఇంత వరకూ ఎక్కడా చెప్పలేదు. తమిళనాడులో మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చేస్తున్న ప్రయత్నాల్లో అక్కడి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నంలోఅన్ని దక్షిణాది పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని జగన్ మోదీకి అన్వయిస్తూ.. అన్యాయం చేయవద్దని కోరారు.
సమావేశానికి వెళ్లకుండా బీజేపీని సంతృప్తి పరచడం
ఆ కూటమి సమావేశానికి వెళ్తే బీజేపీకి కోపం వస్తుంది. అలా కోపం వచ్చిన మరుక్షణం తమ తన రాజకీయ భవిష్యత్ అంధకారం అయిపోతుందని ఆయనకు తెలుసు. అందుకే సమావేశానికి వెళ్లలేదు. అలాగని ఆయన బీజేపీని పూర్తి స్థాయిలో నమ్మలేరు. కాంగ్రెస్ కూటమిని దూరం చేసుకోలేరు. ఇప్పటికే ఆయన ఢిల్లీలోచేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ కూటమి నేతలు మాత్రమే వచ్చారు. ఇప్పుడు వారికి ఏ విషయంలోనూ మద్దతు తెలియచేయకపోతే భవిష్యత్ లో అసలు పట్టించుకోరు. అందుకే మోడీకి లేఖ రాసినట్లుగా వారికీ సమాచారం ఇచ్చారు.
జగన్ మాతోనే ఉన్నారన్న కనిమొళి
జగన్ మాతోనే ఉన్నారని వచ్చే సమావేశానికి వస్తారని డీఎంకే కనిమొళి ప్రకటించారు. అంటే తెరవెనుక ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తాను కాంగ్రెస్ కూటమితోనే ఉంటానని..అయితే బీజేపీని ధిక్కరించే వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి ఇప్పటికిప్పుడు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంత కాలం ఇంకా ఆ పార్టీ కాళ్లు పట్టుకుని ఉంటానని.. తర్వాత లాగేస్తానని ఆయన సమాచారం ఇచ్చారు. జగన్ రాజకీయం చూసిన ఎవరికైనా జరిగేది ఇదే అని అర్థం అవుతుదంది. బీజేపీని భలే మోసం చేస్తున్నారని వైసీపీ ఫ్యాన్స్ అనుకుంటారు. కానీ బీజేపీ అంత అమాయకంగా రాజకీయం చేస్తుందా అన్నదే వారు తెలుసుకోలేకపోతున్నారు.