” రేపు అన్న ముఖ్యమంత్రి అయ్యాక అవ్వా తాతల ముఖాల్లో చిరునవ్వు చూడటానికి వారి పింఛన్‌ను పెంచుతూ పోతాడు.. రూ.3 వేలకు తీసుకుపోతాడు.. అని చెప్పండి… వాళ్లిచ్చే రూ.2000కు మోసపోవద్దని చెప్పండి…” ఇదీ జగన్మోహన్ రెడ్డి తిరుపతి సభలో చెప్పిన మాట. తానును రాగానే.. రూ. 3వేలు పెన్షన్ చేస్తానని ఎక్కడైనా ఉందా…? రూ. 3వేలకు తీసుకుపోవడం ఏమిటి..? ఎప్పుడు తీసుకుపోతాడు..? ఇలాంటి అనుమానాలు సహజంగానే అందరికీ వస్తాయి. కానీ ఆయన చెప్పుకునే ఎల్లో మీడియా మీడియా సహా అందరూ.. జగన్ వస్తే రూ. 3వేలు ఇస్తారని చెప్పడం ప్రారంభించారు. కానీ జగన్.. కండిషన్స్ అప్లై అని.. తన మాటల్లోనే దాన్ని బయట పెట్టి.. పెన్షన్ పొందుతున్న వృద్ధులను మోసం చేయడానికి సిద్ధమయ్యారని అర్థం చేసుకోవచ్చు.
నిజంగా జగన్మోహన్ రెడ్డి… వృద్ధులకు రూ. 3వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలనుంటే… తాను వచ్చిన తర్వాత మొదటి సంతకం.. పెన్షన్ల పెంపు మీదనే పెడతానని చెబుతారు. కానీ.. ఆయన తన హీరో క్యారెక్టర్ .. కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకున్నారు. కేసీఆర్ ఎన్నికల హామీలు అమలు చేయాలనే ఆలోచన ఇంత వరకూ చేయలేదు. గెలిచిన రెండు నెలలు అయినప్పటికీ.. హామీ ఇచ్చినట్లుగా పెన్షన్లు కానీ.. నిరుద్యోగభృతి కానీ ప్రకటించలేదు. ఈ విషయంలో.. కేసీఆర్… నింపాదిగా వ్యవహరిస్తున్నారు . ఒక వేళ పొరపాటున తాను అధికారంలోకి వస్తే.. ఈ పెన్షన్లు… ఇవ్వడం సాధ్యం కాదని.. జగన్‌కు తెలుసు కాబట్టి.. రూ. మూడు వేలకు పెంచుకుంటూ పోతాడని.. హామీ ఇచ్చారు. ఎప్పుడు పెంచుతారు..? ఎలా పెంచుతారు..? లాంటి లాజిక్కులేవీ.. గెలిచిన తర్వాత అడగకుండా అన్నమాట.
ప్రభుత్వం నుంచి సామాజిక పెన్షన్లు పొందుతున్న వారిపై జగన్మోహన్ రెడ్డి.. ఇలా ఆశ పెట్టి మైండ్ గేమ్ ఆడుతున్నారన్న విషయం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒక వేళ తాను వస్తే.. మొదటగా.. అదే నిర్ణయం తీసుకుంటానని తాను చెప్పలేదని.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక ఇస్తానని చెప్పుకోవచ్చు. దాని కోసం..మూడేళ్లు…నాలుగేళ్లు సమయం తీసుకోవచ్చు. కానీ తనకు కావాల్సిన అధికారం దక్కుంది. దాదాపుగా ప్రతి సంక్షేమ పథకం హామీ విషయంలో జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రకటనలు చేయలేదు. కేవలం… తాను వస్తే ఇస్తానంటున్నారు కానీ.. నమ్మకం కలిగించేలా చెప్పడం లేదు. ఎన్నిక ఏరు దాటడానికి తెప్పలా.. ఈ హామీల్ని వాడుకుంటున్నారు.