జగన్ రెడ్డి తన చుట్టూ ఓ మాయా ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుని అందులో తాము ఏమనుకుంటున్నాడో అదే జరుగుతుందని.. తాను ఏం చెబితే అదే నమ్ముతారనే ఓ నమ్మకంతో బతికేస్తున్నారు. రియాలిటీలోకి వచ్చేందుకు అసలు ఆసక్తిగా లేరు. ఓడిపోయిన తర్వాత అయినా నిజాన్ని తెలుసుకుంటారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఆయన తనకు అలవాటైన.. కంఫర్ట్ జోన్ లోనే ఉండిపోయి…. జనంతో సంబంధం లేని రాజకీయలు చేస్తూ.. ఇంకా ఇంకా దిగజారిపోతున్నారు. దానికి తాజా ఉదాహరణ ఢిల్లీలో ధర్నా.
అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టడానికి ఢిల్లీలో ధర్నా పెట్టుకున్నారు. నిజంగా ఢిల్లీలో ధర్నా చేస్తే ఎవరు పట్టించుకుంటారన్న సంగతిని తర్వాత చర్చించుకుందాం.. అసలు అసెంబ్లీని ఎగ్గొట్టడానికి దొరికిపోయేలా ఈ డేట్ ను ఖరారు చేసుకోవడమే ఆయన అమాయకత్వానికి నిదర్శనం. అసెంబ్లీ సమావేశాల్లో పోరాటం చేయడం ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సిన పని . అది చట్టసభ. ఏం చేసినా అక్కడే చేయాలి. కానీ అక్కడ్నుంచి పారిపోయి ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పడంలోనే పెద్ద తప్పిదం ఉంది.
ఇక ఢిల్లీలో ధర్నా చేస్తే ఎవరు పట్టించుకుంటారు ? . ఓ రాష్ట్ర శాంతిభద్రతల అంశంపై ఆ రాష్ట్ర విపక్షం ఆ రాష్ట్రంలోనే తేల్చుకోవాలి. ఢిల్లీలో ధర్నా చేస్తే ఏం చేస్తారు ?. సాధారణంగా ఢిల్లీలో ఎవరు ధర్నా చేస్తారు.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లాలనుకున్నవారు చేస్తారు ?. ఏపీ లా అండ్ ఆర్డర్ లో కేంద్రం ఏం చేస్తుంది ?. ఏమైనా చేయగలిగితే.. జగన్ పాలనలో ప్రతీ రోజూ రాష్ట్రపతి పాలన విధించాలి. టీడీపీ ఆఫీసుపై దాడి చేసినప్పుడు బీపీ వచ్చి దాడి చేశారని సమర్థించిన ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాన్ని ఏ కేంద్ర ప్రభుత్వమైన సహిస్తుందా ?
Read More: జగన్తో మీటింగ్కు ఐదుగురు ఎంపీలు డుమ్మా !
ఇప్పుడు ఢిల్లీలో ఆయన చేసే ధర్నాకు వచ్చే పది మంది ఎమ్మెల్యేలను చూసి.. జాతీయ మీడియానే కూడా.. ఎవరైనా తెలిసిన వాళ్లు కూడా ఘెల్లుమంటారు. 151 సీట్లతో అధికారం తెచ్చుకుని.. ఐదేళ్ల కాలంలో ఘోరమైన పరిపాలనతో పదకొండు సీట్లకు పడిపోయిన జగన్ రెడ్డి నిర్వాకాలు మరోసారి గుర్తుకు తెచ్చుకుంటారు. ఏపీలో పరిస్థితులు ఎలా ఉంటాయో.. వైసీపీ మీడియా చెప్పేది కాదు.. జాతీయ మీడియాకూ నిజం తెలుసు. తాను చెప్పేదే నిజమని.. వందల మందిని చంపేశారని… జగన్ చెబితే కామెడీగా నవ్వుకుని వెళ్తారు.
జగన్ రెడ్డి వాస్తన ప్రపంచంలో రాజకీయాలు చేసినప్పుడే ఆయనను ఓ నేతగా ఎవరైనా గుర్తిస్తారు. లేకపోతే పొలిటికల కమెడియన్ గానే మిగిలిపోతారు. ఇప్పటి వరకూ ఏపీలో ఉన్న ఆ ఇమేజ్ ఇక ముందు ఢిల్లీకి విస్తరించడానికి కూడా రెడీ అయిపోయారు. యుద్ధాన్ని గ్రౌండ్ లో కాకుండా దూరంగా చేస్తే.. ఎవరూ ప్రత్యర్థిగా కూడా గుర్తించరు. ఇప్పుడుఅదే జరగబోతోంది.