కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని ఢిల్లీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఆల్ పార్టీ మీటింగ్ లో విజయసాయిరెడ్డి ప్రత్యేకహోదా కావాలని అడిగీ అడగనట్లుగా ప్రస్తావించినా దాన్ని జైరాం రమేష్ బయట ఏదో ఆయన పోరాడినట్లుగా ప్రచారం చేశారు. హోదా కోసం వైసీపీ ప్రయత్నిస్తోందని చెప్పేందుకు ప్రయత్నించారు. మరో వైపు గతంలో రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఘోరంగా అవమానిస్తూ.. ట్వీట్లు పెట్టిన విజయసాయిరెడ్డి ఇప్పుడు పల్లెత్తు మాట అనడం లేదు. పరస్పర సహకారంలో భాగంగా కొత్త రాజకీయ వ్యూహాన్ని పాటిస్తున్నారని అంటున్నారు.
Read Also : మొత్తానికి అసెంబ్లీకి డుమ్మా కొట్టేందుకే జగన్ ఫిక్స్ అయ్యారా?
జగన్ ఢిల్లీ పర్యటనకు ఎంచుకున్న అంశం జాతీయ రాజకీయాలకు సంబంధం లేనిది కానీ మోదీని కలుస్తానని చెప్పుకొచ్చారు. అపాయింట్మెంట్ అడిగారు. కానీ ఇవ్వడం కష్టమే. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు ఇచ్చే అవకాశం ఉంది. ఈ పర్యటనలో బీజేపీకి జగన్ సంకేతాలు పంపుతారని.. తన విషయంలో కఠిన చర్యలు ప్రారంభిస్తే.. తాను కాంగ్రెస్ వైపు వెళ్తానని సంకేతాలు ఇస్తారని అంటున్నారు. జగన్ పై సీబీఐ కేసుల్లో విచారణలకు సమయం దగ్గర పడింది. వివేకా హత్య కేసులో సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తే.. ఆయన పేరు కూడా బయటకు వస్తుంది.
తాజాగా ఇసుక, మద్యం స్కాముల్లో ఈడీ, సీబీఐ విచారణలకు రంగం సిద్ధమయిందని చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం అవినీతిని బయట పెట్టి సీబీఐ, ఈడీకి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కారణంగానే జగన్ తొందరపడుతున్నారని … తన విషయంలో దర్యాప్తులంటూ దూకుడు ప్రదర్శించకుండా.. కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారన్న సంకేతాలు పంపుతున్నారని అంటున్నారు.
ఇప్పుడు బీజేపీ వ్యవహరించే విధానమే కీలకం. జగన్ పై ఏ మాత్రం సానుభూతి చూపించినట్లుగా కనిపించినా కూటమి పార్టీలను అవమానించినట్లే అవుతుంది. అది అనేక సమస్యలకు దారి తీయవచ్చు.