రైల్వే స్టేషన్లో అనౌన్సర్లా యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్ అని జగన్ రెడ్డి బీజేపీ జాతీయ నేతల్ని పదే పదే విజ్ఞప్తి చేసుకుంటున్నారు. లడ్డూ కల్తీ విషయంలో తన వాదన వినాలంటూ లేఖలు రాసి.. ఎడిట్ చేసిన ప్రెస్మీట్ల వీడియోలను పోస్టి చేసి.. గుర్తొచ్చిన ప్రతి ఒక్కరికీ ట్యాగ్ చేస్తున్నారు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే… అవకాశం వస్తే అందరి దగ్గరకు పోయి… శీలపరీక్ష చేయించుకోవడానికి రెడీగా ఉన్నానని సంకేతం పంపుతున్నట్లుగా ఉంది. ఆయన ఎందుకు ఇంతగా బీజేపీ నేతలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారో వైసీపీ నేతలకూ అర్థం కావడం లేదు.
అసలు లడ్డూ కల్తీ వివాదంలో బీజేపీ నేతలకు ఎందుకు జగన్ వివరణ ఇస్తున్నారు…. ఏం జరిగినా అంతా చంద్రబాబే అన్నట్లుగా అక్కడా చంద్రబాబుపై ఎందుకు నెట్టేస్తున్నారు… పనిలో పనిగా బీజేపీది భాగం ఉంటుందని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా ఎందుకు మాట్లాడుతున్నారు ?. అనేది వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. బీజేపీ కన్నెర్ర చేస్తే తాను పడే కష్టాలకు అంతు ఉండదని..అలాంటి కష్టాలు ఈ లడ్డూ కల్తీ ఇష్యూ వల్ల వచ్చాయని జగన్ బలంగా నమ్ముతున్నారు. తన క్రైస్తవత్వం…తన హయాంలో జరిగిన మత మార్పిళ్ల కారణంగా లడ్డూ కల్తీ జరిగిందని నమ్ముతారని జగన్ భయపడుతున్నారు.
వారు నమ్ముతారో లేదో కానీ జగన్ చెప్పే మాటల్ని మాత్రం వంద శాతం నమ్మరు. ఎందుకంటే ఆయన చేసిన వ్యవహారాలన్నీ అలాగే ఉన్నాయి. ఏ మాత్రం విశ్వసనీయత లేని రాజకీయాలు ఆయన చేశారు. ఒక్క టంటే ఒక్క నిజం లేకుండా.. అబద్దాల పునాదుల మీద ఆయన రాజకీయాలు చేశారు. అందుకే.. జగన్ చెప్పేది కాకుండా తమ ఎదురుగా ఉన్న సాక్ష్యాలనే నమ్ముతారు. అందుకే ఎవరూ ఆయన ట్యాగులను పట్టించుకోవడం లేదు.