ఇక నుంచి కార్యకర్తల్ని గొప్పగా చూస్తానని జగన్ రెడ్డి.. నెల్లూరు పార్టీ నేతల సమావేశంలో చెబితే ..గొప్పగా చూడటమంటేఏమిటి.. ఎవర్ని చూస్తారని సామాన్య కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. తర్వాత రోజే పెద్దిరెడ్డి సుధారాణి అనే సోషల్ మీడియా అబ్యూజర్ ను పిలిపించుకుని.. మీరు బూతులు కొనసాగించండి..జైళ్లకెళ్లండి..నేను లాయర్‌ను పెడతాను అని భరోసా ఇచ్చి పంపించారు. ఆయన తీరు చూసి వైసీపీ నేతలు ఇక.. జన్మలో మారరని డిసైడ్ అయిపోతున్నారు.
పట్టించుకవాల్సిన కార్యకర్తలు ఇలా పార్టీ పరువును సోషల్ మీడియాలో పడేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న వారిని కాదు. పార్టీ కోసం గ్రౌండ్ లెవల్లో కష్టపడుతున్న కార్యకర్తల్ని. కానీ వారు చెప్పుకోవడం లేదు.. తన వద్దకు వచ్చి జేజేలు కొట్టడం లేదు కాబట్టి వారెవరూ మన పార్టీ కార్యకర్తలు కాదన్నట్లుగా వ్యవహరిచడం.చ..వారిని దివాలా తీసే స్థితికి నెట్టేయడం మాత్రం మానడం లేదు. ఏ పార్టీకి అయినా కార్యకర్తలే పిల్లర్లు కానీ సోషల్ మీడియా అబ్యూజర్లు కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కరు అయినా.. కాస్త సెన్సిబుల్ గా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు ఉన్నారు.
అయితే జగనన్న తోపు అని పోస్టులు పెట్టడం..లేకపోతే సమయం , సందర్భం లేకుండా ప్రభుత్వాన్ని, మంత్రుల్ని తిట్టడం, ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం తప్ప.. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు సోషల్ మీడియాలో వైసీపీకి లేరు. గ్రౌండ్ లెవల్లో ఇప్పటికే అందరూ వైసీపీపై అభిమానం ఉన్నా.. వైఎస్ కుటుంబం అంటే సానుభూతి చూపిస్తున్నా.. వైసీపీ కోసం పని చేయడానికి ఆసక్తికరంగా లేరు. దీన్ని గుర్తించి.. ఆ కార్యకర్తల అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం జగన్ చేయాలి కానీ అబ్యూజర్లను ప్రోత్సహించడం వల్ల జరిగిపోయిన డ్యామేజ్ ఇంకా పెరుగుతుంది కానీ.. తగ్గదు. కానీ జగన్ రెడ్డికి చెప్పేవారెవరు ?