మీ కోటాలో టీటీడీ బోర్డులో ఒకరికి చోటిస్తాం.. పేరు పంపించండి అని సీఎం జగన్ రెడ్డి సీబీఐ చీప్కు… చీఫ్ జస్టిస్ కూ సమాచారం పంపించారని ఏపీ లోని ఓ ప్రముఖ దినపత్రిక సంచలన కథనం ప్రచురించింది. వారిద్దరూ తోసిపుచ్చారని చెప్పినప్పటికీ ఇలాంటి సాహసం జగన్ రెడ్డి చేయడం మాత్రం… చర్చనీయాంశమవుతోంది.
జగన్ రెడ్డి తాను చేసిన ఘోరమైన నేరాలకు వ్యవస్థల్ని వాడుకునే విధానం భిన్నంగా ఉంటుందని చాలా సార్లు రుజువు అయింది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డగోలుగా రాష్ట్రం కోసం కాకుండా ఇతర ప్రయోజనాలను ఆశించి ఉపయోగిస్తూ ఉంటారు. ప్రజల కోసం పని చేయాల్సిన పదవుల్ని… నిరంజన్ రెడ్డి, కృ,ష్ణయ్య, పరిమళ్ నత్వానీ వంటి బయట వ్యక్తులకు కేటాయిచారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. తాజాగా టీటీడీ బోర్డు సభ్యత్వాలను… రెండు అత్యున్నత వ్యవస్థల అధిపతులకు ఆఫ్ర చేయడం అంటే.. దుర్వినియోగం పరాకాష్టకు చేరుకున్నట్లే.
వారి మనుషులకు వారు వద్దన్నా… వారి గుడ్ లుక్స్ లో ఉండొచ్చు.. తీసుకుంటే మాత్రం ఇక తిరుగు ఉండదని అనుకుని జగన్ రడ్డి ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారేమో కానీ… తనకు అనుకూలంగా ఉండేలా వ్యవస్థల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేయడం మాత్రం … పులి మీద స్వారీ చేయడమే. దేవుడిని కూడా తన కేసుల నుంచి బయటపడేందుకు ఉపయోగించుకోవడం… చిన్న విషయం కాదు.