పదవి కోసం ప్రజల మధ్య పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి .. అధికారం వచ్చాక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. రెండు కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాఫ్టర్లను వాడారు. తన సొంత ఇంటిని వందల కోట్లు పెట్టి విలాసంగా మార్చుకున్నారు. ప్రజల్ని కలిసిందే లేదు. ఎప్పుడూ జిల్లాల పర్యటనలకు వెళ్లిందే లేదు. తాను జిల్లాలు పర్యటిస్తానని ఎప్పటికప్పుడు ప్రకటించడమే తప్ప వెళ్లింది లేదు. చూసింది లేదు. బటన్ నొక్కుడు సభలకు గాల్లో పోయి.. బటన్ నొక్కి.. టీడీపీని.. చంద్రబాబును.. పవన్ ను తిట్టి గాల్లో తిరిగి రావడమే ఆయన చేసిన పర్యటనలు.
ఇప్పుడు ఎన్నికలకు ముందు జనాల్లోకి వస్తానని ఆయన చెబుతున్నారు. అదీ కూడా కోడ్ వచ్చి న పది రోజుల తర్వాత . అత్యంత విలాసంగా జనం సొమ్ముతో కొనుగోలు చేసిన బస్సులో ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లబోతున్నారు. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగి.. బహిరంగసభ పెట్టాలనుకుంటున్నారు. ఇది ఎన్నికల ప్రచారమే కానీ.. తన పాలన ఎలా జరుగుతుందో.. ప్రజలు ఏమనుకుటున్నారో తిరిగి తెలుసుకునే ప్రయత్నం కాదు. అంటే.. ఓట్లేసి గెలిసి గెలిపిచిన ఐదేళ్లు ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుని మళ్లీ ఎన్నికల కోసమే .. ఓట్లు అడిగేందుకు తిరిగి వస్తున్నారన్నమాట.
ఇప్పుడు ఆయనకు ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్ లభించదు. సాధారణ పార్టీ అధ్యక్షుడిగా వెళ్లాలి. ప్రభుత్వ యంత్రాంగం సహకరించదు. సహకరిస్తే సస్పెండ్ చేస్తారు. డ్వాక్రా మహిళల్ని సభలకు తరలించలేరు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి ఆయన పార్టీ నేలకు..సభలకు జనాల్ని తరలించడం ఓ సవాల్ గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే .. లబ్దిదారులకు అనేక పథకాలకు సంబంధించి డబ్బులు అకౌంట్లలో జమ కావాల్సి ఉంది. వారంతా సభకు వచ్చి నిలదీస్తే… అసలుకే తేడా వస్తుంది.