“ దే ఆర్ కిడ్స్ “ అని తేల్చేశారు జగన్. ఎవరిని ఉద్దేశించి ఉంటే ఇంటూరి రవికిరణ్, వర్రా రవీంద్రారెడ్డిలతో పాటు సోషల్ సైకోలుగా మారి మహిళల్ని కించ పరుస్తున్న వారిని అరెస్టు అవుతున్న. వారిని ఉద్దేశించి. గతంలో వివేకా. హత్య కేసులో చిన్న పిల్లోడు అయిన అవినాష్ రెడ్డిని ఇరికించి ఆయన జీవితాన్ని నాశనం చేయబోతున్నారని కూడా చెప్పారు. ఇంకా విచిత్రంగా ఓ సందర్భంగా.. తాను కూడా చిన్నోడినేన చెప్పుకుంటున్నారు. పెద్ద గీత పక్కన చిన్న గీత గీస్తే ఎలా ఉంటుందో జగన్ రెడ్డి మాటలు అలాగే ఉంటాయి.
ఈ సోషల్ సైకోలు చిన్నవాళ్లో.. పెద్ద వాళ్లో తర్వాత సంగతి .. ఇప్పుడు వారు అలా కేసుల పాలై.. జైల్లో చిప్పకూడు తినడానికి కారణం ఎవరు ?. వారి కుటుంబాలు సమాజంలో సైట్ల కుటుంబాలుగా ముద్రపడటానికి కారణం ఎవరు?. నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి. ఆయన మానసిక వికృతానందం కోసం తాను అధికారంలో ఉన్నాను కాబట్టి ..తనకు నచ్చనివాళ్లపై బూతులతో దాడి చేయంచారు. వారు బాధపడుతూంటే తాను ఆనందించారు. అధికారం పోయాక ఆయనకు పోయిందేమీ లేదు. ఆయన ఎవరితో అయితే దాడులు చేయించారో వారే కేసులు పెట్టించుకుని జైలుకు పోతున్నారు. జగన్ రెడ్డికి మాత్రం.. వీటిని కూడా రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ఎలా ప్రయత్నించాలా అని ప్లాన్ చేస్తున్నారు.
ఆ కుటుంబాల వ్యధ ఖచ్చితంగా జగన్ రెడ్డి పాఠమే. వారి జీవితాలపై ఈ సోషల్ కేసుల ముద్ర తీసివేయలేరు. చదువులు, ఉద్యోగులు, బంధుమిత్రులు చూసే విధానం, చివరికి పెళ్లి సంబంధాలు కూడా ప్రభావితం అవుతాయి. తన మానసిక వికృతానందం కోసం ఆయా కుటుంబాలను కష్టాల్లో పెట్టారు జగన్. ఇప్పుడు నీతులు చెబుతున్నారు. వాళ్లను జైలు నుంచి బయటకు తెచ్చినంత మాత్రాన ఉపయోగం లేదు..కానీ చేయాల్సిన డ్యామేజ్ మాత్రం లెక్కలేనంత చేశారు.