ఏడేళ్ల పాప హత్యను రాజకీయం చేద్దామని బయలుదేరాలనుకున్నజగన్ రెడ్డి ఆగిపోయారు. ఆ పాప తండ్రితో ఉన్న వ్యాపార గొడవల వల్లే ఆయన శత్రువులు పాపను చంపినట్లుగా తేలడంతో ఇక రాజకీయం పెద్దగా వర్కవుట్ కాదని జగన్ ఆగిపోయారు. ఆ పాపపై అత్యాచారం జరిగిందని మరొకటని ఇష్టం వచ్చినట్లుగా వైసీపీ నేతలతో పాటు సాక్షి మీడియాలోనూ ప్రచారం చేయించారు., చివరికి అదంతా నిజం కాదని తేలింది. చనిపోయిన పాపపై ఇంత ఘోరమైన ప్రచారం చేయడంపై పుంగనూరు ముస్లిం వర్గాల్లో అసంతప్తి వ్యక్తమయింది.
పాప తల్లిదండ్రులు కూడా ఇప్పటికే బిడ్డను కోల్పోయామని ఇక ఆ పాపను కూడా రాజకీయాల కోసం వాడుకోవద్దని వైసీపీ నేతలకు నేరుగానే సూచించినట్లుగా చెబుతున్నారు ఇప్పటికే రోజా, శ్యామల వంటి వారితో పాప మృతిపై తప్పుడు ప్రచారం చేయించేశారు. పోలీసులు నిజం చెప్పినా… పోస్టుమార్టం రిపోర్టుబయట పెట్టినా వారు మాత్రం తగ్గలేదు. పాప కుటుంబం మానసిక క్షోభ కు గురయ్యే ప్రమాదం ఉన్నా ఆపలేదు. దీంతో జగన్ పర్యటన వాయిదా వేసుకోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు.
ఓడిపోయినప్పటి నుండి పుంగనూరులో అడుగు పెట్టడానికి తంటాలు పడుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు కాస్త పరిస్థితులు నిమ్మళంగా ఉండటంతో ఊళ్లోకి అడుగు పెడుతున్నారు. ఇప్పుడు జగన్ రావడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే మరిన్ని ఇబ్బందులు వస్తాయని అనుకుని పెద్దిరెడ్డి కూడా రాకపోతేనే మంచిదని చెప్పినట్లుగా తెలుస్తోంది.