రెండున్నరేళ్లలో ఏం చేశారు ? సీమకుఏం చేశారు..? విశాఖకు ఏం చేశారు..? కోస్తాకు ఏం చేశారు ? ఇదీ.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వేసిన ప్రశ్న. . తన వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకులో ఈ సారి ఆయన నేరుగా ప్రభుత్వంపై ఎటాక్‌కు దిగారు. తనపై ఓ తప్పుడు కేసు పెట్టారన్న కోపమో ఏమో కానీ.. ఆయన ప్రభుత్వ విధానాలను నేరుగా విమర్శించారు. ముఖ్యంగా మూడు రాజధానుల అంశంలో కొత్తగా అటు రాయలసీమలో.. ఇటు ఉత్తరాంధ్రలోనూ కొత్తగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడంపై తీవ్రంగా విమర్శించారు. ఏమీ చేయలేక మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
అమరావతి రాజధానిగా ఉండాలని రైతులు చేస్తున్న పోరాటానికి కౌంటర్‌గా రాయలసీమ మేధావుల పేరుతో కొంత మంది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడంపై ఆర్కే సూటి ప్రశ్నలు వేశారు. విశాఖలో రాజధాని వస్తే రాయలసీమ ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో హైదరాబాద్‌లో హైకోర్టు ఉన్న మూసి ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదు.. ఇప్పడు హైదరాబాద్‌లో సెక్రటేరియట్ ప్రాంతంలో వ్యాపారాలు ఎందుకు లేవు.., హైకోర్టు సెక్రటేరియట్ లేకపోయినప్పటికీ సైబరాబాద్ ప్రాంతానికే ఎక్కువ డిమాండ్ ఎందుకు ఉంది.. ? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఆర్కే సంధించారు. నిజానికి ఆన్సర్లు కూడా అందులో ఉన్నాయి.
అంతులేని ప్రజావ్యతిరేకను మూటగట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇక పాలన చతకాదని డిసైడయ్యారని ఆర్కే అభిప్రాయపడుతున్నారు. అందుకే విద్వేష రాజకీయం ప్రారంభించారని తేల్చేశారు. రెండున్నరేళ్లలో ఒక్కకంటే ఒక్క అభివృద్ది పని జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్కే ఆ విషయాన్ని సూటిగా మరింత జనంలోకి తీసుకెళ్లేందుకు తన ఆర్టికల్‌ను ఉపయోగించారని స్పష్టమవుతోంది .
మరో వైపు అధికారం మారితే తప్పుడు కేసులు పెట్టిన వారు.. వారి వెనుక ఉన్న సూత్రధారులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో.. తన కేసు ద్వారా ఆయన పరోక్షంగా భయం కల్పించే ప్రయత్నం చేశారు. తనపై ఫిర్యాదు చేసిన సీఐడీ అధికారి సత్యనారాయణను రఘురమిరెడ్డి అనే ఉన్నతాధికారి ఒత్తిడి చేసి పెట్టించారని.. రేపు ప్రభుత్వం మారిదే.. కేసు పెట్టిన సత్యనారాయణ రివర్స్‌లో ఒత్తిడి చేసి కేసు పెట్టించారని.. చెబుతారని.. అప్పుడు సినిమా కనిపిస్తుందన్నట్లుగా ఆర్కే చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మారితే ఇలాంటి వ్యవహారాలు కుప్పలు కుప్పలుగా వస్తాయని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. ఆర్కే అదే విషయాన్ని మరింత బలంగా చెప్పారు.
ఎలూ చూసినా కొంత కాలంగా ఆర్కే కాస్త దూకుడుగా ఆర్టికల్స్ రాస్తున్నారు. పరిస్థితి మారుతోంది.. పూర్తిగా మారుతోందన్న ధైర్యంతో ఆయన ఆర్టికల్స్ ఉంటున్నాయి. ప్రజావ్యతిరేకత పెరుగుతుందన్న ఆయన నమ్మకమే దీనికి కారణం అయి ఉండవచ్చు.