ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శారదా పీఠానికి వెళ్తున్నారు. అక్కడ రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ రాజశ్యామల ఆలయం….పూజలు..హోమాలు.. అధికారం సుస్థిరం చేసుకునేందుకు చేస్తారని.. తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో.. కేసీఆర్ .. అదే శారదాపీఠానికి చెందిన స్వరూపానందతో… యాగం చేయించుకున్నాకే బయట ప్రపంచానికి తెలిసింది. కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో … ఆ యాగం పూర్తి చేసి.. ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఘన విజయం సాధించారు. తరవాత జగన్మోహన్ రెడ్డి కూడా… ఎన్నికలకు ముందు.. రాజశ్యామల యాగం చేశారు. యాగఫలాలో.. లేక… సహజంగానే ఫలితాలు వచ్చాయో కానీ… వారికి మంచే జరిగింది.
దాంతో… ముఖ్యమంత్రులకు స్వరూపానందపై గురి కుదిరింది. జగన్మోహన్ రెడ్డి.. మరింత నమ్మకం పెంచుకున్నారన్న అభిప్రాయం గట్టిగానే వినిపిస్తోంది. దీనికి కారణం… విశాఖకు రాజధాని మార్పు నిర్ణయం వెనుక ప్రధాన కారణం… స్వరూపానంద సలహాలేనని .. టీడీపీ నేతలు కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు. ఇరవై మూడో తేదీ లోపు… రాజధానిని తరలించకపోతే.. ఏలిన నాటి శని పట్టుకుంటుందని చెప్పారని.. అందుకే జగన్ హడావుడి చేస్తున్నరని… దేవినేని ఉమ లాంటి నేతలు బహిరంగ విమర్శలు చేశారు. అయితే.. 23వ తేదీలోపు తరలించలేకపోయారు. ఫలితంగా… ఇప్పుడు ఆయన శాంతి పూజలు చేయాలనుకుంటున్నారని.. ఈ మేరకు స్వరూపానంద సలహా ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ కారణంతోనే జగన్.. స్వరూపానంద ఆశ్రమంలో రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి… స్వరూపానంద ఆశ్రమంలో రెండు, మూడు గంటలు ఉంటారని అంటున్నారు. కోర్టుకు హాజరవకుండా.. రాష్ట్రాభివృద్ధి కోసం.. ప్రతి క్షణం కష్టపడుతున్నానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి … పూజల కోసం.. మాత్రం… ఎలాంటి వారెంట్లు లేకపోయినా తీరిక చేసుకుంటున్నారు.