అధికారంలోకి వచ్చిన వెంటనే రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏడాది జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ అంటూ యువతును మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఇప్పటి వరకూ వాలంటీర్ పోస్టులు ఇచ్చి అవే ఉద్యోగాలంటున్నారు. ఎన్నికలకు ముందు… ఉద్యోగాల పేరుతో మరోసారి మోసం చేసేదుకు రెడీ అయ్యారు. ఓ సారి అనుమతి అంటారు.. మరోసారి జీవో అంటారు… మరో సారి ఏపీపీఎస్సీ రూల్స్ అంటారు. ఇలా అనేక రకాలుగా ప్రాసెస్ చేసి. . ఎన్నికలకు ముందు నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని రిస్క్ లో పెట్టేయబోతున్నారు.
తాజాగా కొన్ని గ్రూప్ వన్, గ్రూప్ టు ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది ఏపీపీఎస్సీకి వెళ్లి చాలా ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది .. చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవారు.. ఎన్నికల కోసంం ఆడుతున్న నాటకం కాబట్టి మెల్లగా చేస్తారు. త్వరలో డీఎస్సీ ప్రకటించినా ఆశ్చర్యం లేదు . గత ప్రభుత్వం మూడు సార్లు డీఎస్సీ వేస్తే … తాను రాగానే మెగా డీఎస్సీ అని చెప్పి…. జగన్ రెడ్డి చేసిన మోసానికి నాలుగున్నరేళ్లు అయింది. ఒక్క ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. ఓ సారి జాబ్ క్యాలెండ్ ప్రకటిస్తే అందులో ఉన్న ఉద్యోగాలు చూసి నిరుద్యోగులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఇందులోనూ గ్రూప్ వన్, టు ఉద్యోగాలు 50 కూడా లేవు.
గ్రూప్ వన్.. టు ఉద్యోగాల కోసమే నిరుద్యోగులు పెద్ద ఎత్తున కష్టపడుతూంటారు. నోటిఫికేషన్లు వస్తాయని కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూంటారు. ఇప్పుడు ఇచ్చిన ప్రకటన చూసి.. వారు నిరాశపడ్డారు. ఉద్యమం చేశారు. పోలీసు ఉద్యోగాల కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టుల నోటిఫికేషన్ల కోసం చూస్తున్నారు. ఆరేడు వేల పోస్టులుఏడాదికి భర్తీ చేస్తామని గతంలో జగన్ హామీ ఇచ్చారు. అసలు భ ర్తీనే లేకుండా పోయింది.
ఇప్పుడు ఎన్నికలకు ముందు… నోటిఫికేషన్లతో మరోసారి మోసం చేయడానికి బయలుదేరారు. మోసం చేసేవారిది తప్పు కాదు… పదే పదే మోసపోయేవాళ్లదే అసలు తప్పు.