జగన్ రెడ్డి ప్రజల గురించి ఏమనుకుంటన్నారో కానీ ప్రజలంతా కరువుతో అల్లాడిపోూంటే అసలు కరువే లేదని నిర్మోహమాటంగా బహిరంగసభల్లో చెబుతున్నారు. తాము చెప్పేది నమ్ముతారు.. తాము రాసేదే చదువుతారు.. అదే నిజమన్న భ్రమలో ప్రజలు ఉంటారని జగన్ రెడ్డి గట్టి నమ్మకంతో ఉన్నారు. కళ్ల ముందు కనిపిస్తున్న కరువును కూడా . కాదని చెప్పేంత తెగింపు ఆయనకు వచ్చింది. రైతు భరోసా నిధులను బటన్ నొక్కడానికి ఏర్పాటు చేసిన బహిరంగసభలో బటన్ నొక్కిన తర్వాత చేసిన ప్రసంగం విన్నవారికి .. ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లుగా.. అచ్చమైన హలోకేషన్ లో జగన్ రెడ్డి బతికేస్తున్నారన్న అబిప్రాయం ఏర్పడితే అందులో తప్పేమీ లేదు.
చంద్రబాబు హయాంలో రైతులందరూ కష్టాలుపడిపోయారని..తాను సీఎం పీఠం ఎక్కగానే అందరూ ఒక్క సారిగా సిరి సంపదలు, సుఖ సంతోషాల్లోకి వచ్చేశారన్నట్లుగా ఆయన చెబుతున్నారు. జగన్ రెడ్డి ఏడాదికి ఒకే సారి పన్నెండున్నర వేలు ఇస్తానని హామీ ఇచ్చి.. పీఠంలోకి వచ్చి మూడు విడతలుగా ఏడున్నర వేలు ఇస్తున్నాడు. కేంద్రం ఇచ్చి పీఎం కిసాన్ నిధులు తాను ఇస్తున్నట్లుగా చెప్పుకుంటున్నాడు. నిజానికి రెడ్డి హామీ ఇచ్చే నాటికి పీఎం కిసాన్ పథకం లేదు. రైతు భరోసా పేరుతో ఉన్న పథకాలన్నింటినీ ఆపేశాడు. రైతుల్ని నట్టేట ముంచారు. చివరికి దాన్యం అమ్ముకోవాలన్నా పక్క రాష్ట్రానికి పోవాల్సిన పరిస్థితి. వ్యవసాయానికి ఇబ్బంది లేకండా కరెంట్ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. అసలు పంటలే వేయనప్పుడు కరెంట్ తో సంబందం ఏమిటన్న సెటైర్లు వస్తున్నాయి. రైతులు పంట పండిస్తే.. ప్రభుత్వం కొంటే దాన్ని కూడా రైతులకు ఉచితంగా ఇచ్చిన సాయం అన్నట్లుగా చెప్పుకోవడం జగన్ రెడ్డికే చెల్లింది.
ప్రతి సభను రాజకీయ సేభగా మార్చుకోవడం ఆయన చేసిన పని కాబట్టి.. ఈ సభలోనూ కళ్లార్పకుండా అబద్దాలు చెప్పేశారు. చంద్రబాబుపై కుట్రుల చేసి పద్దతి పాడు లేకుండా కేసులు పెట్టేసి.. చూశారా చంద్రబాబుపై ఎన్ని కేసులు ఉన్నాయో.. అవన్నీ అవినీతి వల్లేనని నమ్మబలికారు జగన్ రెడ్డి తీరు చూస్తే.. వినేవాడు చెప్పవాడు లోకువని.. ప్రజల్ని ఓ మాదిరిగా చూడని లీడరని.. అందరికీ అనిపిస్తుంది. ప్రజల్నితక్కువగా చూస్తున్న ఒక్క జగన్ రెడ్డికి తప్ప.