జగన్ రెడ్డి ఓ పదిహేను రోజులు ఎన్నికలు ముందు వస్తే బాగుండని అనుకుంటున్నారు. మార్చి , ఏప్రిల్ నెలల్లో కరెంట్ కోతలు విదించాల్సి రావొచ్చని అదే జరిగితే తన పనితనంపై కోపంతో ప్రజలు బలంగా బటన్ నొక్కేసిన ఇంటికి పంపేస్తారని భయపడుతున్నారు.అందుకే కేబినెట్ సమావేశంలో పదిహేను రోజులు ఏపీలో ముందుగా ఎన్నికలు రావొచ్చని చెబుతున్నారు.
అయితే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. షెడ్యూల్ ప్రకారం మార్చి పదో తేదీలోపు .. ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. 2019లో అదే చేశారు. ఏడు విడతలుగా ఎన్నికలు నిర్వహించి ఎప్పుడో జూన్ లో ఫలితాలు ప్రకటిస్తారు. కానీ ఏపీ తెలంగాణలకు సంబంధించినంత వరకు మొదటి విడతలోనే ఎన్నికలు పూర్తయిపోతాయి. అంటే షెడ్యూల్ ప్రకటించిన రెండు, మూడు వారాల్లో నోటిఫికేషన్.. ఆ తర్వాత నెల రోజుల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది. ఎలా చూసినా.. ఫిబ్రవరిలో షెడ్యూల్ ప్రకటించినా.. ఏప్రిల్ వరకూ పోలింగ్ ఉంటుంది.
కానీ అక్కడి వరకూ పోలింగ్ జరగకూడదని జగన్ రెడ్డి కోరుకుంటున్నారు. అందుకే ముందుగానే టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. అంత కన్నా ముందుగానే ఎన్నికలు పెట్టాలన్నట్లుగా వైసీపీ నేతలు .. ఎన్నికల సంఘానికి వినతి పత్రం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పటికే ఇచ్చి ఉంటారని కూడా భావిస్తున్నారు. జగన్ రెడ్డికి అంత కంగారు ఉంటే.. తెంలగాణ ఎన్నికలతో వెళ్లిపోయినా బాగుండేదని వైసీపీలోనే సెటైర్లు వినిపిస్తున్నాయి
తెలంగాణలో బీఆర్ఎస్సె గెలుస్తుందన్న గట్టి నమ్మకంతో జగన్ ఉన్నారని.. చివరికి ఇప్పుడు కంగారు పడాల్ి వస్తుందని ఆ పార్టీ నేతుల చెవులు కొరుక్కుంటున్నారు