ఆయన పేరు బ్రహ్మానందరెడ్డి. ఆయన యూనియన్ బ్యాంక్ లో కీలక అధికారిగా విజయవాడ రీజియన్ లో పని చేసేవారు. మనం మనం బరంపురం అన్నట్లుగా ప్రభుత్వ పెద్దల నుంచి ప్రతిపాదనలు రాగానే యూనియన్ బ్యాంకు నిధుల్ని వేల కోట్లు అప్పనంగా అప్పులు ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఇవేం అప్పులు అని ఆర్బీఐ హెచ్చరించడంతో… వెంటనే ఉన్నతాధికారులు బ్రహ్మానందరెడ్డిని ఆ స్థానం నుంచి బదిలీ చేసి.. ముంబైలో ఓ అప్రాధాన్య పోస్టులో పడేశారు. రిటైరయ్యే వరకూ అక్కడే ఉన్న ఆయనకు… తాజాగా ఏపీ గవర్నమెంట్ ఓ పదవి ఇచ్చింది .. డిస్కమ్ లో పదవి కట్టబెట్టేసింది.
అంటే బ్యాంక్ బ్రహ్మానందరెడ్డి ఇప్పుడు జగన్ రెడ్డి సర్కర్ లో డిస్కమ్ బ్రాహ్మనందరెడ్డి అయ్యారు. జగన్ రెడ్డి తన అక్రమాలకు వంత పాడిన వాళ్లందరికీ తిలా పాపం తలా పిడికెడు అని పంచే తరహాలో ప్రయోజనాలు కల్పిస్తూనే ఉంటారు. అది ఆయన సొమ్ము కాదు. ప్రజాధనం. ఔట్ సోర్సింగ్ పేరుతో బయట నుంచి తీసుకుని జీతాలిస్తున్న వేల మంది ఆయన కోసం.. అడ్డగోలు పనులు చేసిన వాళ్లే. వాళ్లకు వ్యక్తిగతంగా ఎప్పుడూ చెల్లింపులు చేయరు. ప్రజాధనాన్ని మాత్రం దోచి పెడుతూ ఉంటారు.
ఏపీ సర్కార్ అప్పులు తెచ్చేందుకు కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడటం… అలా అప్పులిచ్చిన వారికి ప్రభుత్వంలోనే పదవులు ఇవ్వడం అసాధారణ వ్యవహరం. అలవి మాలిన అప్పులు చేసిన రాష్ట్రం… వాటి కోసం అడ్డదోవలు తొక్కింది. ప్రభుత్వం మారితే ఈ అప్పుల అక్రమాలపైనా కేసులు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.