ఏదైనా ప్రభుత్వం తాము జారీ చేసిన జీవోను చట్ట విరుద్దమని హైకోర్టు కొట్టి వస్తే సిగ్గుతో తలదించుకుంటుంది. అదే కొన్నాళ్ల కిందట అయితే రాజీనామాల మాట వినిపించేది. అయితే జగన్ రెడ్డి వచ్చాక.. తప్పుడు పనులు చేసేసి కుదిరితే వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోవడం లేకపోతే కోర్టుల్లో వింత వాదనలు వినిపించడం కామన్ అయిపోయింది. ఇలాంటి వ్యవహారాలతో కొన్నాళ్లు జీవోను అమలు చేయగలుగుతున్నారు కానీ..తర్వాత కొట్టి వేతకు గురవుతోంది. తాజాగా బీఈడీ కళాశాల్లో తనిఖీలు చేస్తామంటూ ఓ జీవో ఇచ్చిన సర్కార్ తీరును హైకోర్టు తేల్చి పడేసింది. కొట్టేసింది.
మామూలుగా ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టి వేస్తే సంచలన విషయం. కానీ ఏపీలో అదో రొటీన్ విషయం. పనికి మాలిన.. రాజ్యాంగ విరుద్ధమైన జీవోలు ఎన్ని విడుదలయ్యాయో లేక్కే లేదు. ఆ జీవోలపై కోర్టుల్లో పడిన కేసులు విచారణ పూర్తయితే.. ఏ రూల్స్ ప్రకారం ఈ జీవో వర్తింపు సాధ్యం కాదని కొట్టివేతకు గురవుతోంది. ఇలా కొన్ని వందల జీవోలు రాజ్యంగ విరుద్ధంగా… నిబంధనలకు విరుద్ధంగా రిలీజ్ చేశారు. అవేమీ న్యాయస్థానాల్లో నిలబడటం లేదు. కానీ పాలకులకు ఇసుమంత కూడా సిగ్గు ఉండటం లేదు. పాలన అంటే.. కనీస నైతికత లేకుండా సాగుతోంది.
తప్పుడు నిర్ణయాలు తీసుకోకకూడదనే అధికార వ్యవస్థ ఉంటుంది. ఏది చట్ట ఉల్లంఘన నిర్ణయమో వారు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఎన్ని జీవోలను హైకోర్టు కొట్టి వేస్తుందని.. అలా కొట్టి వేస్తే పాలన అడ్డుకుంటారని వారిపైనే నిందలేస్తే… వదిలేస్తారని అనుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికీ అనేక అంశాల్లో అమల్లో ఉన్న జీవోలపై కోర్టుల్లో కేసులు ఉన్నాయి. వాటి వల్ల అనేక మందికి అన్యాయం జరుగుతోంది. వాటిపై కేసులు కోర్టుల్లో ఉన్నాయి. వాటి సంగతి తేలాల్సి ఉంది.