వైసీపీ అధినేత, సీఎం జగన్ రెడ్డి … తన రాజకీయాలకు పేదల్ని పావులుగా వాడుకుని వారిని బలి చేస్తున్నారు. పేదలను అడ్డం పెట్టుకుని రాజకీయ వ్యూహాలకు పాల్పడుతూ.. తాను రాజకీయ ప్రయోజనం పొంది.. పేదల్ని మాత్రం నడి రోడ్డుపై వదిలిస్తున్నారు. దానికి తాజా ఊదాహరణ ఆర్ 5 జోన్లలో ఇళ్లు.
కోర్టు కేసులు గెలిచామని బొంకి మరీ పేదలకు అన్యాయం
ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణం అనేది కోర్టులో ఉంది. పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో ఆడిన రాజకీయాన్ని ఇళ్ల నిర్మాణం వరకూ తీసుకెళ్లారు. అసలు ఆ ల్యాండ్ పై ధర్డ్ పార్టీకి హక్కులు వెళ్లే చాన్స్ లేదు. అలాంటప్పుడు.. అక్కడ ఇళ్లు కడితే చట్ట విరుద్ధమవుతుంది. సుప్రీంకోర్టు కూడా పట్టాల పంపిణీకే చాన్సిచ్చింది. కానీ జగన్ రెడ్డి ఇళ్లు కట్టేస్తామని బయలుదేరారు. శంకుస్థాపన చేశారు. నిజానికి రాజ్యాంగాన్ని గౌరవించి ప్రమాణం చేసిన ఏ సీఎం కూడా చేయకూడని పని అది. కానీ జగన్ రెడ్డికి అలాంటివేమీ లేవు. సభలో కోర్టు కేసులు గెలిచామని బొంకారు. పేదల్ని నమ్మించి నట్టేట ముంచారు.
స్థలాలు, ఇళ్లు ఇవ్వాలనుకుంటే ఎక్కడివారికక్కడ ఇవ్వొచ్చుగా ?
పేదలకు ఇళ్లు ఇవ్వాలనుకుంటే ఎక్కడెక్కడి వారినో తీసుకొచ్చి.. ఎందుకు వివాదాస్పదమైన ఆర్ 5 జోన్లో ఇళ్లు ఇస్తున్నారు…? విజయవాడ వారికి విజయవాడలో.. గుంటూరు వారికి గుంటూరులో. . పల్నాడు వారికి పల్నాడులో ఎందుకివ్వరు ? సెంట్ స్థలాన్ని రాజధానిలో అని ఆశ చూపించి వారిని రోడ్డున పడేయడం తప్ప.. ప్రభుత్వ ప్లానే లేదు. అంత వరకూ ఎందుకు ఏ వివాదం లేని… మంగళగిరి సమీపంలోని నవులూరులో జగనన్న లే ఔట్ల పేరుతో అమ్మకానికి పెట్టిన భూమి ఎవరూ కొనడం లేదు. వాటిని సెంటు స్థలాలుగా ఎందుకు పంపిణీ చేయడం లేదు. వివాదం లేకపోతే ఇవ్వరు.. వివాదం ఉంటే ఇచ్చి.. ఆగిపోతే… పేదలతో రాజకీయం చేస్తారు. కానీ వారి గూడు గురించి మాత్రం పట్టదు.
ఎన్ని చోట్ల ఇళ్లు కట్టించారు ?
సెంటు స్థలాలను నివాస యోగ్యం కాని చోట్ల పంపిణీ చేశారు. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తమని పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. కానీ ఎక్కడా ప నులు జగడం లేదు. పేదలకు గట్టిగా పది వేల ఇళ్లు కూడా కట్టించలేదు. ఇళ్ల నిర్మాణం పేరుతో పేదల్ని అప్పుల పాలు చేశారు. ఆ పేదల్ని నివాసయోగ్యం కాని ఇళ్ల కోసం… నిలువునా ముంచుతున్నారు. రాజకీయం చేస్తున్నారు.
జగన్ రెడ్డి తీరు మొదటి నుంచి ఇంతే…. ఇంగ్లిష్ మీడియం పేరుతో పేదల్లో ఓ తరం విద్యార్థుల భవిష్యత్ ను నాశనం చేశారు. ఇసుక కొరత, ఉపాధి లేకుండా చేసి వారిని మరింత దిగజార్చారు. మద్యం రేట్లు విపరీతంగా పెంచి మద్యం అలవాటున్న పేదలకుటుంబాల రక్తం పీల్చేస్తున్నారు. మొత్తంగా పేదలు ఈ సర్కార్కు రాజకీయ ఆయుధంగా మారిపోయారు.