ఏపీ అసెంబ్లీలో జగన్ రెడ్డి ప్రసంగించారు. ఎన్నికలకు ముందు చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ఆయన తన పాలనా తీరును ఎలా సమర్థించుకుంటారా అని అందరూ ఆసక్తిగా చూశారు. కానీ ఆయన కరోనా వల్ల నష్టపోయామని.. ప్రతీ రాష్ట్రానికి ఓ పవర్ హౌస్ లా ఉండే మహానగరం లేకపోవడం వల్ల ఇంకా నష్టపోయామని అందు వల్ల ఏమీ చేయలేకపోయామన్నట్లుగా వివరణ ఇచ్చారు. ఈ ప్రసంగం విని వైసీపీ ఎమ్మెల్యేలకు మైండ్ బ్లాంక్ అయింది. ఎక్కడైనా బల్లలు చరిచి చప్పట్లు కొడదామన్నా చాన్సివ్వకుండా.. ఐదేళ్ల తన చేతకాని తానికి కారణాలు చెప్పుకుంటూ పోయారు. ఇంకా విశేషం ఏమిటంటే మూడు రాజధానులు చేస్తానని.. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానని ఆయన చెప్పలేదు.
ప్రతీ రాష్ట్రానికి ఓ పవర్ హౌస్ ఉండాలని.. అలాంటి పవర్ హౌస్ విశాఖ అవుతుందని ఎక్కువ సార్లు ప్రస్తావించానని చెప్పుకొచ్చారు. ఐదేళ్లలో విశాఖకు ఏంచేశారో.. మాత్రం చెప్పలేదు. ఆదాయం పెరగలేదని పదే పదే తన చేతకాని తనానికి కారణంగా చెప్పారు కానీ.. ఎందుకు పెరగలేదో మాత్రం చెప్పలేదు. గత ప్రభుత్వ ఆర్థిక విధానాలంటారు.. కోవిడ్ అంటారు.. మరొకటి అంటారు.. అంతే తప్ప.. తాను సాధించినది ఏమిటన్నది మాత్రం చెప్పలేకపోయారు. ఐదేళ్ల పాటు పరిపాలన చేసి.. నేను ఫలానా ఘనత సాధించానని చెప్పుకుని ఎన్నికలకు వెళ్తారు. కానీ జగన్ రెడ్డి.. గత ప్రభుత్వాన్ని.. కోవిడ్‌ను…రాష్ట్ర విభజనను చంద్రబాబును బూచిగా చూపెట్టేందుకు ప్రయత్నించారు. పైగా పొత్తులు పెట్టుకున్నారని.. ఏడుపులు కూడా ఉన్నాయి.
రాజకీయంగా వేరే పార్టీల వ్యూహాల గురించి అసెంబ్లీలో జగన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన నిరాశా నిస్పృహల్లో ఉన్నట్లుగా ఉన్నారు. బహిరంగసభల్లో చెప్పే ప్రసంగాలనే అటూ ఇటూగా మళ్లీ అసెంబ్లీలో చదివి వినిపించారు.