ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నులు పెంచుకుటూ పోతోంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ.. అవకాశం లేకపోయినా స్పేస్ చూసుకుని మరీ పెంచుకుటూ పోతోంది. పెట్రోలో నుంచి టోల్ చార్జీల వరకూ కొత్త కొత్త ఆలోచనలు చేసిన ఏపీ సర్కార్.. ఈ సారి ఆస్తుల మీద కన్నేసింది. ఆస్తి పన్నును అలాగే ఉంచడం కాదు.. వాటి విలువతో పాటు పెంచుకుంటూ పోవాలని నిర్ణయించింది. ఈ మరేకు ఆస్తిపన్ను చట్టానికి సవరణ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం 2021-22 ఆర్ధిక సంవత్సరం నుంచి ఆస్తి పన్నును రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా నిర్ధారిస్తారు. ప్రస్తుతం ఏడాది అద్దె విలువ ప్రాతిపదికన ఆస్తి పన్ను లెక్కింపు జరుగుతోంది.
మార్చిన విధానం ప్రకారం రిజిస్ట్రేషన్ విలువలను సవరించిన ప్రతి సారీ ఆస్తి పన్ను పెరుగుతుంది. పెంపు దల కూడా భారీగా ఉండనుంది. ఇప్పటి వరకూ రెండు వేల వరకూ పన్ను కట్టే వాళ్లు.,. ఇక ముందు వివిధ అంచనాలు వేసిన తర్వాత కనీసం పది వేల వరకూ కట్టాల్సిన రావొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే పన్నుల మదింపులోనూ.. చాలా నిబంధనలు ఉన్నాయి. ఈ పన్నుల పెంపు ద్వారా.. కనీసం .. రెండు, మూడు వందల కోట్లు అయినా అదనపు ఆదాయాన్ని ప్రజల వద్ద నుంచి పిండుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే రోడ్ల కోసం అంటూ పెట్రోల్ పై సర్ చార్జీ వేశారు. టోల్ చార్జీలు వసూలుకు నిర్ణయం ప్రకటించారు. రేపోమాపో అమలు చేయడం ప్రారంభించనున్నారు. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత.. దాదాపుగా.. ప్రతీ అంశంలోనూ పన్నులు పెంచారు. ్వన్నీ.. నేరుగా సామాన్యుడి రోజు వారీ జీవన ప్రమాణాలపై ప్రభావం చూపేలాంటివే. ప్రజా వ్యతిరేకత వస్తుందనే ఆలోచనను ప్రభుత్వం అసలు పెట్టుకోవడం లేదు. ప్రస్తుతం గడవాలంటే… తప్పదన్నట్లుగా పన్నులు పెంచుకుంటూ పోతున్నారు.